Smartwatch: పండగ సేల్‌లో స్మార్ట్‌వాచ్‌ కొంటున్నారా? అమెజాన్‌లో వీటిపై ఓ లుక్కేయండి!

Smartwatch: పండగ సీజన్‌ నేపథ్యంలో ఇ-కామర్స్‌ సంస్థలు ఆకర్షణీయమైన ఆఫర్లను ప్రకటించాయి. స్మార్ట్‌వాచ్‌లపై వివిధ కంపెనీలు రాయితీలు ఇస్తున్నాయి. కొనాలని ప్లాన్‌ చేసుకుంటున్నవారికి ఇది మంచి అవకాశం.

Published : 09 Oct 2023 12:23 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్మార్ట్‌వాచ్‌ (Smartwatch) కొందామని ప్లాన్‌ చేస్తున్నారా? పండగ సీజన్‌ అందుకు మంచి అవకాశం. ఇప్పటికే ఇ-కామర్స్‌ సంస్థలు ప్రత్యేక సేల్‌ను ప్రారంభించాయి. స్మార్ట్‌వాచ్‌ (Smartwatch)లు, ఫోన్లు సహా అనేక వస్తువులపై ఆకర్షణీయ ఆఫర్లను ప్రకటించాయి. ‘గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2023 (Amazon Great Indian Festival sale 2023)’ పేరిట అమెజాన్‌ ప్రారంభించిన సేల్‌లో పలు కంపెనీల స్మార్ట్‌వాచ్‌ (Smartwatch)లపై రాయితీలు ఉన్నాయి.

శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 4 బ్లూటూత్‌ (Samsung Galaxy Watch 4)..

శాంసంగ్‌ గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌ స్మార్ట్‌వాచ్‌లు 40mm,  44mm సైజ్‌ వేరియంట్లు సేల్‌లో అందుబాటులో ఉన్నాయి. 44mm గెలాక్సీ వాచ్‌ 4 బ్లూటూత్‌ వేరియంట్‌ అన్ని ఆఫర్లతో కలిపి ప్రస్తుతం రూ.7,999కు లభిస్తోంది. ఇది రూ.26,999 వద్ద మార్కెట్‌లోకి ప్రవేశించింది. దీనితో పోలిస్తే ప్రస్తుతం ఈ వాచ్‌ 70 శాతం డిస్కౌంట్‌పై లభిస్తోంది. ఇటీవలే గెలాక్సీ వాచ్‌ 4 సిరీస్‌కు వేర్‌ ఓఎస్‌ 4- ఆధారిత వన్‌ యూఐ 5 అప్‌డేట్‌ను శాంసంగ్‌ అందించింది. ఈ వాచ్‌లు ఎగ్జినోస్‌ W920 ప్రాసెసర్‌, 1.5జీబీ ర్యామ్‌, 16జీబీ స్టోరేజ్‌తో వస్తున్నాయి.

అమేజ్‌ఫిట్‌ పాప్‌ 3ఎస్‌ స్మార్ట్‌వాచ్‌ (Amazfit Pop 3S Smartwatch)..

అమేజ్‌ఫిట్‌ పాప్‌ 3ఎస్‌ వాచ్‌ తాజా సేల్‌ ధర రూ.2,999. సాధారణ సమయంలో దీని ధర రూ.3,499. 1.96 అంగుళాల అమోలెడ్‌ తెరతో వస్తున్న ఈ వాచ్‌లో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ ఉంది. ఏఐ వాయిస్‌ అసిస్టెన్స్‌ కూడా ఉంది. 12 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది. 100 వాచ్‌ ఫేస్‌లు, 100 స్పోర్ట్స్‌ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. ఇది రూ.5,999 ధర వద్ద మార్కెట్‌లోకి వచ్చింది.

షాపింగ్‌ స్పెషల్‌.. ₹399కే అమెజాన్‌ ప్రైమ్‌!

నాయిస్‌ కలర్‌ఫిట్‌ అల్ట్రా 3 (Noise ColorFit Ultra 3)..

మెటాలిక్‌ స్ట్రాప్‌ కావాలనుకునేవారికి నాయిస్‌ కలర్‌ఫిట్‌ అల్ట్రా 3 వాచ్‌ను పరిశీలించొచ్చు. 1.96 అంగుళాల అమోలెడ్‌ స్క్రీన్‌తో వస్తోన్న ఈ వాచ్‌ రూ.2,999కే అందుబాటులో ఉంది. దీని లాంఛ్‌ ప్రైస్‌ రూ.8,999.

వన్‌ప్లస్‌ నార్డ్‌ వాచ్‌ (OnePlus Nord Watch)..

ఈ పండగ సీజన్‌లో వన్‌ప్లస్‌ తమ ఉత్పత్తులపై మంచి ఆఫర్లను ఇస్తోంది. నార్డ్‌ వాచ్‌ ప్రస్తుతం రూ.3,999కే లభిస్తోంది. 1.78 అంగుళాల అమోలెడ్‌ తెరతో వస్తోన్న ఈ వాచ్‌లో 105 ఫిట్‌నెస్‌ మోడ్‌లు ఉన్నాయి. 10 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది. రూ.6,999 ధర వద్ద ఇది మార్కెట్‌లోకి వచ్చింది.

బోట్‌ ఎక్స్‌టెండ్‌ ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ (boAt Xtend Plus Smartwatch)..

ఎక్స్‌టెండ్‌ ప్లస్‌ స్మార్ట్‌వాచ్‌ను బోట్‌ తాజా అమెజాన్‌ సేల్‌లో రూ.1,998కే అందిస్తోంది. దీని లాంఛ్‌ ధర రూ.9,499. 1.78 అంగుళాల అమోలెడ్‌ తెరను ఇస్తున్నారు. 100 స్పోర్ట్స్‌ మోడ్‌లు అందుబాటులో ఉన్నాయి. బ్యాటరీ లైఫ్‌ ఏడు రోజుల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఫైర్‌ బోల్ట్‌ ఫీనిక్స్‌ (Fire-Boltt Phoenix)..

రౌండ్‌ డయల్‌ స్మార్ట్‌వాచ్‌ కోసం చూసే వారు ఈ సేల్‌లో అందుబాటులో ఉన్న ఫైర్‌బోల్ట్‌ ఫీనిక్స్‌ వాచ్‌ను పరిశీలించొచ్చు. రూ.12,999తో మార్కెట్‌లోకి వచ్చిన ఈ వాచ్‌ ప్రస్తుతం రూ.1,999కే అందుబాటులో ఉంది. నలుపు, గోల్డ్‌, బూడిద రంగు స్ట్రాప్‌ కలర్‌ వేరియంట్లు ఉన్నాయి. 1.43 అంగుళాల అమోలెడ్‌ తెరతో వస్తోన్న ఈ వాచ్‌లో స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ డయల్‌ ఉంటుంది. మూడు గంటల్లో ఇది పూర్తిగా ఛార్జ్‌ అవుతుందని కంపెనీ తెలిపింది.

ఎంఐ పండగ సేల్‌.. స్మార్ట్‌ఫోన్లపై 45 శాతం వరకు డిస్కౌంట్‌

రెడ్‌మీ వాచ్‌ 3 యాక్టివ్‌ (Redmi Watch 3 Active)..

రెడ్‌మీ వాచ్‌ 3 యాక్టివ్‌ రూ.2,599కే లభిస్తోంది. ఇది రూ.5,999 దగ్గర మార్కెట్‌లోకి వచ్చింది. బ్లూటూత్‌ కాలింగ్‌తో వస్తోన్న ఈ వాచ్‌లో అనేక హెల్త్‌ ఫీచర్లు ఉన్నాయి. 1.83 అంగుళాల తెర ఉన్న ఈ వాచ్‌ బ్యాటరీ లైఫ్‌ 12 రోజుల వరకు ఉంటుందని కంపెనీ తెలిపింది.

అమేజ్‌ఫిట్‌ జీటీఎస్‌ 4 మినీ (Amazfit GTS 4 Mini)..

2022 జులైలో విడుదలైన అమేజ్‌ఫిట్‌ జీటీఎస్‌ 4 మినీ ప్రస్తుతం 7,999 దగ్గర లభిస్తోంది. దీని ఒరిజినల్‌ ధర రూ.10,999. 1.65 అంగుళాల తెరతో వస్తోన్న ఈ వాచ్‌లో బిల్ట్‌-ఇన్‌ అలెక్సా ఫీచర్‌ ఉంది. 120 స్పోర్ట్స్‌ మోడ్‌లతో పాటు ఫిట్‌నెస్‌ ట్రాకర్‌ కూడా ఉంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 15 రోజుల వరకు బ్యాటరీ లైఫ్‌ ఉంటుంది.

బోట్‌ అల్టిమా క్రోనోస్‌ (boAt Ultima Chronos)..

1.96 అంగుళాల అమోలెడ్‌ తెరతో వస్తోన్న బోట్‌ అల్టిమా క్రోనోస్‌ రూ.1,999కే అందుబాటులో ఉంది. అడ్వాన్స్‌డ్‌ బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌తో వస్తోన్న ఈ వాచ్‌లో ఫిట్‌నెస్‌ ట్రాకర్‌, స్ట్రెస్‌, స్లీప్‌ మేనేజ్‌మెంట్‌ ట్రాకర్లు ఉన్నాయి.

నాయిస్‌ నోవా (Noise Nova)..

1.4 అంగుళాల అమోలెడ్‌ తెరతో వస్తోన్న నోవా స్మార్ట్‌వాచ్‌ ప్రస్తుత సేల్‌లో రూ.2,499కే అందుబాటులో ఉంది. దీని ఒరిజినల్‌ ధర రూ.7,999. దీంట్లో బ్లూటూత్‌ కాలింగ్‌ ఫీచర్‌ ఉంది. రౌండ్‌ డయల్‌, ఆరు స్ట్రాప్‌ వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. 10 రోజుల బ్యాటరీ లైఫ్‌ ఉంటుందని కంపెనీ తెలిపింది.

అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ 2023 (Amazon Great Indian Festival sale 2023) అక్టోబర్‌ 8న ప్రారంభమైంది. వివిధ రకాల వస్తువులపై రాయితీలు, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లతో పాటు ఎస్‌బీఐ డెబిట్‌, క్రెడిట్‌ కార్డుల ద్వారా కొనుగోళ్లు చేసేవారికి అమెజాన్‌ 10 శాతం రాయితీ కూడా ఇస్తోంది. షావోమి, వన్‌ప్లస్‌ వంటి సంస్థలు అదనపు ఆఫర్లను కూడా ఇస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని