BSNL: బీఎస్‌ఎన్‌ఎల్‌ దీపావళి ఆఫర్‌.. ఈ ప్లాన్లపై అదనపు డేటా

BSNL Diwali Offer: దీపావళి సందర్భంగా యూజర్ల కోసం ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. అవేంటంటే..?

Published : 03 Nov 2023 18:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ (BSNL) దీపావళి సందర్భంగా తన యూజర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ప్రస్తుతం అందిస్తున్న కొన్ని ప్రీ పెయిడ్‌ (prepaid plans) ప్లాన్లకు అదనపు డేటా ప్రయోజనాలను జోడించింది. వీటితోపాటూ రీఛార్జ్‌లపై డిస్కౌంట్‌ కూడా అందిస్తోంది.

బీఎస్‌ఎన్‌ఎల్ ప్రస్తుతం అందిస్తున్న రూ.251 రీఛార్జ్‌ ప్లాన్‌ 70జీబీ డేటా, 28 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. అయితే ఈ ప్లాన్‌లో వాయిస్‌కాల్స్‌, ఎస్సెమ్మెస్‌ల సదుపాయం ఉండదు. దీపావళి ఆఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌తో రీఛార్జ్‌ చేసుకుంటే అదనంగా 3జీబీ డేటా పొందొచ్చు. అంటే 28 రోజులకు గానూ 73 జీబీ డేటా వస్తుంది. అలాగే, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు, 90 రోజుల వ్యాలిడిటీతో వచ్చే రూ.299, రూ.398 ప్లాన్లతో అదనంగా 3జీబీ డేటా పొందొచ్చు. వీటితో పాటూ బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.499 ప్లాన్‌, రూ.599 ప్లాన్‌, రూ.666 రీఛార్జ్‌ ప్లాన్లతో కూడా అదనంగా 3జీబీ డేటా పొందొచ్చు.

‘కింగ్‌ ఆఫ్‌ క్రిప్టో’గా పేరొందాడు.. చివరకు దోషిగా తేలాడు!

బీఎస్‌ఎన్‌ఎల్‌ ‘సెల్ఫ్‌ కేర్‌ యాప్‌’ ద్వారా రీఛార్జ్‌ చేసుకుంటేనే అదనపు డేటా ప్రయోజనాలు పొందుతారు. అంతే కాదు సెల్ఫ్-కేర్ యాప్‌ని ఉపయోగించి రీఛార్జ్ చేసుకునే బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లుకు మరో ఆఫర్‌ను అందిస్తోంది. యాప్‌ ద్వారా రూ.249 కంటే ఎక్కువ రీఛార్జ్‌పై (prepaid plans) ప్రత్యేకంగా 2 శాతం తగ్గింపు పొందొచ్చు. అయితే సెల్ఫ్-కేర్ యాప్‌ ద్వారా మాత్రమే ఈ రెండు ప్రయోజనాలు వర్తిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు