BSNL 4g: సిమ్‌ అప్‌గ్రేడ్‌పై BSNL ఉచిత డేటా ఆఫర్‌

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ సిమ్‌ కార్డును ఉచితంగా అప్‌గ్రేడ్‌ చేసుకోవాలని వినియోగదారులకు సూచిస్తోంది. దీంతో పాటు 4 జీబీ ఉచిత డేటా పొందొచ్చని చెప్తోంది.

Published : 06 Nov 2023 14:14 IST

BSNL 4g sim upgrade | ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (BSNL) సిమ్‌ కార్డు అప్‌గ్రేడ్‌పై ఆఫర్‌ ప్రకటించింది. ఇప్పటికీ 2జీ/3జీ సిమ్‌ కార్డులు వాడుతున్న వారు 4జీ సిమ్‌ కార్డుకు అప్‌గ్రేడ్‌ అయ్యేలా ప్రోత్సహించేందుకు ఉచిత డేటా ఆఫర్‌ను బీఎస్‌ఎన్‌ఎల్‌ తీసుకొచ్చింది. త్వరలో 4జీ సేవలు అందుబాటులోకి రానున్న వేళ BSNL ఈ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌లో భాగంగా 4జీబీ డేటా ఉచితంగా లభిస్తుంది. మూడు నెలల పాటు ఈ డేటాను వినియోగించుకోవచ్చని బీఎస్‌ఎన్‌ఎల్‌ పేర్కొంది.

ఒకవేళ మీరు వాడుతున్నది పాత సిమ్‌ కార్డో, కొత్తదో తెలీకపోతే ‘SIM’ అని 54040 నంబర్‌కు మెసేజ్‌ పంపితే ఆ వివరాలు తెలుస్తాయి. ఒకవేళ పాత సిమ్‌ కార్డు వాడుతున్నట్లయితే దగ్గర్లోని బీఎస్‌ఎన్‌ఎల్‌ కార్యాలయానికి గానీ, రిటైలర్‌ దగ్గర గానీ, ఫ్రాంఛైజీ దగ్గర గానీ ఉచితంగా సిమ్‌ కార్డును పొందొచ్చు. దీనివల్ల ఉచిత డేటాతో పాటు 4జీ సేవలు అందుబాటులోకి రాగానే వేగవంతమైన డేటాను ఆనందించొచ్చు.

క్రెడిట్‌ కార్డు తీసుకొని వాడట్లేదా.. ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే!

దేశవ్యాప్తంగా ఇప్పటికీ 3జీ సేవలు అందిస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్‌.. త్వరలో 4జీ సేవలు ప్రారంభించనుంది. డిసెంబర్‌లో తొలుత పంజాబ్‌లో 4జీ సేవలు ప్రారంభిస్తామని సంస్థ సీఎండీ పీకే పుర్వార్‌ ఇటీవల తెలిపారు. వచ్చే ఏడాది జూన్‌ నాటికి దేశవ్యాప్తంగా 4జీ సేవలు అందుబాటులోకి తీసుకురానున్నామని, ఆ వెంటనే 5జీ సేవల అప్‌గ్రేడేషన్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు చెప్పారు. మరోవైపు దీపావళి ఆఫర్‌లో భాగంగా రూ.249, రూ.251, రూ.299, రూ.398, రూ.499, రూ.599, రూ.666 ప్లాన్లపై 3జీబీ అదనపు డేటా సదుపాయాన్ని ప్రకటించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని