ఇకపై ‘ఎక్స్‌’ యూజర్లు ప్రతి నెలా చెల్లించాల్సిందే.. కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ల వివరాలివే!

ఎక్స్‌లో నెలవారీ రుసుముతో మూడు కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను పరిచయం చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఎక్స్‌ ప్రీమియం స్థానంలో వీటిని తీసుకురానున్నట్లు సమాచారం.

Published : 06 Oct 2023 18:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) ఆధ్వర్యంలోని సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ఎక్స్ (గతంలో ట్విటర్‌) మరో సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో ఎక్స్‌లో మూడు కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. బేసిక్‌, స్టాండర్డ్‌, ప్లస్‌ అనే పేరుతో తీసుకొస్తున్న ఈ ప్లాన్‌లకు పెట్టుబడిదారులతో జరిగిన సమావేశంలో ఎక్స్ సీఈవో లిండా యాకరినో (Linda Yaccarino) ఆమోదం తెలిపారు. ప్రస్తుతం ఎక్స్ ప్రీమియం (గతంలో ట్విటర్‌ బ్లూ) కోసం యూజర్లు నెలవారీ ఎనిమిది డాలర్లు చెల్లించాలి. త్వరలో దాని స్థానంలో మూడు కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌లను పరిచయం చేయనున్నట్లు తెలుస్తోంది. 

కొత్త ప్లాన్‌ల ద్వారా గతంలో ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ తీసుకోని యూజర్లను ఆకర్షించడంతోపాటు.. ఆదాయం పెంచుకోవాలని ఎక్స్ భావిస్తోంది. కొద్దిరోజుల క్రితం ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజిమన్‌ నెతన్యాహూతో కలిసి ఓ కార్యక్రమంలో పాల్గొన్న మస్క్‌.. త్వరలో స్వల్ప నెలవారీ రుసుముతో కొత్త సబ్‌స్క్రిప్షన్‌ ప్లాన్‌ను పరిచయం చేసే ఆలోచనలో ఉన్నట్లు చెప్పారు. ఎక్స్‌లో ఉన్న బాట్స్‌ను తొలగించేందుకు ఇదే సరైన మార్గమని అప్పట్లో తన నిర్ణయాన్ని సమర్థించుకున్నారు. ఇప్పుడు దాన్నే అమలులోకి తీసుకొస్తున్నారని సమాచారం.

ఎంఐ పండగ సేల్‌.. స్మార్ట్‌ఫోన్లపై 45 శాతం వరకు డిస్కౌంట్‌

బేసిక్‌ ప్లాన్‌లో పూర్తిస్థాయిలో యాడ్‌లు ఉంటాయి. ఇక స్టాండర్డ్‌లో బేసిక్‌తో పోలిస్తే యాడ్‌ల సంఖ్య సగానికి తగ్గుతుంది. ప్లస్‌లో ఎలాంటి యాడ్‌లు ఉండవు. మరోవైపు యూజర్లు ఇతర సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లకు తరలిపోకుండా.. కంటెంట్ క్రియేటర్లకు ఏడాదికి 20 మిలియన్ డాలర్లు చెల్లించాలని ఎక్స్ నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జులై నుంచి ఎక్స్‌ యాడ్‌ రెవెన్యూ నుంచి కొంత మొత్తాన్ని చెల్లిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని