Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్‌ సేల్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్

Flipkart Big Saving Days Sale: ఫ్లిప్‌కార్ట్‌ బిగ్ సేవింగ్ డేస్‌ సేల్‌ ఈ నెల 15 నుంచి ప్రారంభం కానుంది. ఈ సేల్‌లో ఫోన్లతోపాటు గృహోపకరణాలపై భారీ డిస్కౌంట్స్‌ ఉంటుందని ఫ్లిప్‌కార్ట్‌ తెలిపింది. 

Published : 13 Jul 2023 02:02 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) మరో బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌ (Big Saving Days Sale)ను ప్రకటించింది. ఈ సేల్ జులై 15 నుంచి జులై 19 వరకు ఆరు రోజులపాటు కొనసాగనుంది. ఇందులో భాగంగా స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, యాక్సెసరీస్‌లు, ఫర్నిచర్‌లపై 80 శాతం.. టీవీలు, ఇతర గృహోపకరణాలపై 75 శాతం వరకు డిస్కౌంట్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. వీటితోపాటు దుస్తులు, నిత్యావసరాలపై కూడా డిస్కౌంట్లు ఉండబోతున్నాయని ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఈ సేల్‌లో యాక్సిస్ బ్యాంక్‌ క్రెడిట్‌, డెబిట్‌ కార్డ్‌ యూజర్లకు అదనంగా 10 శాతం డిస్కౌంటు ఇస్తున్నట్లు తెలిపింది. అలానే, ఫ్లిప్‌కార్ట్‌ ప్లస్‌ మెంబర్‌షిప్‌ యూజర్లు ముందుగానే  ఈ సేల్‌లో పాల్గొనే అవకాశం ఉంటుందా? లేదా?అనేది తెలియాల్సివుంది. 

ఇదీ చదవండి: నథింగ్ ఫోన్ 2 వచ్చేసింది.. ధర, ఫీచర్లివే!

ఈ సేల్‌లో ఐఫోన్ 13పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 13 ధర ₹ 69,900 ఉండగా.. ₹ 13,900 డిస్కౌంట్‌ ప్రకటించింది. దీంతో ఐఫోన్ 13 ₹ 55,999కే లభిస్తోందిం. మరోవైపు ఐఫోన్ 14పై కూడా ఫ్లిప్‌కార్ట్‌ డిస్కౌంట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. యాపిల్‌ ఇండియా వెబ్‌సైట్‌ ప్రకారం ఐఫోన్ 14 (128 జీబీ) ధర ₹ 79,900గా ఉంది. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ దీనిపై 11 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది. దీంతో ఐఫోన్ 14 (128 జీబీ) ₹ 70,999కే లభిస్తోంది. అయితే, బిగ్‌ సేవింగ్‌ డేస్‌ సేల్‌లో భాగంగా ఈ మోడల్‌పై అదనంగా మరో ₹ 12 వేల డిస్కౌంట్‌ ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. ఈ డిస్కౌంట్ కాకుండా పాత ఫోన్ ఎక్సేంజ్‌, యాక్సిస్‌ బ్యాంక్‌ క్రెడిట్, డెబిట్‌ కార్డ్‌ ఆఫర్లతో ధర మరింత తగ్గే అవకాశం ఉంది. వీటితోపాటు ఇతర బ్రాండ్‌ల ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లపై కూడా భారీ డిస్కౌంట్‌ ఉంటుందని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని