ఆరోగ్య బీమా అపరిమితంగా

పాలసీ మొత్తం ఖర్చవగానే, తిరిగి 100 శాతం భర్తీ అయ్యే సౌలభ్యంతో స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కొత్త పాలసీని తీసుకొచ్చింది.

Updated : 17 Nov 2023 02:46 IST

పాలసీ మొత్తం ఖర్చవగానే, తిరిగి 100 శాతం భర్తీ అయ్యే సౌలభ్యంతో స్టార్‌ హెల్త్‌ అండ్‌ అలైడ్‌ ఇన్సూరెన్స్‌ కొత్త పాలసీని తీసుకొచ్చింది. పూర్తిగా డిజిటల్‌లోనే అందించే ఈ స్మార్ట్‌ హెల్త్‌ ప్రో పాలసీని కనీసం రూ.5లక్షల నుంచి గరిష్ఠంగా రూ.కోటి వరకూ తీసుకునే వీలుంది. పాలసీదారులు తమ అవసరాలను బట్టి తీసుకునేందుకు వీలుగా అయిదు అనుబంధ పాలసీలనూ అందిస్తోంది. ఇందులో అపరిమితంగా పాలసీ మొత్తాన్ని భర్తీ చేసేలా ఒక అనుబంధ పాలసీని ఎంచుకోవచ్చు. పాలసీ మొత్తం ఖర్చయిన వెంటనే తిరిగి ఆ విలువ పునరుద్ధరణ జరుగుతుంది. ఇలా ఒక పాలసీ ఏడాదిలో అపరిమితంగా అది కొనసాగుతూనే ఉంటుంది. ఇది అన్ని రకాల క్లెయింలకూ వర్తిస్తుంది.

ఒక ఏడాదిలో పాలసీని క్లెయిం చేయకపోతే.. 50 శాతం వరకూ క్యుములేటివ్‌ బోనస్‌ లభిస్తుంది. ఇలా 600 శాతం వరకూ లభిస్తుంది. ఆసుపత్రిలో చేరినప్పుడు ఏ గదిని ఎంచుకోవాలన్నదీ పాలసీదారుడు నిర్ణయించుకునేందుకు వీలు కల్పించేలా మరో అనుబంధ పాలసీ ఉంది. ముందస్తు వ్యాధులకు పరిహారం తొందరగా లభించేలా వ్యవధి తగ్గింపు అనుబంధ పాలసీ ఉంది. సాధారణంగా ఈ వ్యవధి 48 నెలలు ఉంటుంది. దీన్ని 36/24/12 నెలలకు తగ్గించుకోవచ్చు. మరో అనుబంధ పాలసీ నాన్‌ మెడికల్‌ వ్యయాలను భరిస్తుంది. కుటుంబంలో ఇద్దరు పెద్దలు, ముగ్గురు పిల్లల వరకూ ఈ పాలసీని ఎంచుకోవచ్చు. 18 ఏళ్ల నుంచి 50 ఏళ్ల వరకూ ఉన్న వారు ఈ పాలసీని తీసుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని