పొదుపు ఖాతా.. ఆరోగ్య ధీమా

బ్యాంకింగ్‌ వ్యవస్థ నేడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఖాతాదారులకు కేవలం సంప్రదాయ ఆర్థిక సేవలను మాత్రమే అందించడంతోనే బ్యాంకులు సరిపెట్టడం లేదు.

Updated : 09 Feb 2024 04:54 IST

బ్యాంకింగ్‌ వ్యవస్థ నేడు వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఖాతాదారులకు కేవలం సంప్రదాయ ఆర్థిక సేవలను మాత్రమే అందించడంతోనే బ్యాంకులు సరిపెట్టడం లేదు. అంతకు మించి ప్రయోజనాలను కల్పించేందుకు ముందుకు వస్తున్నాయి. ఇలాంటి వాటిల్లో ప్రధానంగా ఆరోగ్య బీమా ప్రయోజనాలను పరిశీలించాలి. 

ఆరోగ్య బీమా

పొదుపు ఖాతాదారులకు బృంద ఆరోగ్య బీమా రక్షణ కల్పించేందుకు ఇప్పుడు చాలా బ్యాంకులు ముందుకొస్తున్నాయి. బీమా సంస్థలతో ప్రత్యేక ఒప్పందం కుదుర్చుకొని, వీటిని అందిస్తున్నాయి. పొదుపు ఖాతా ప్రారంభించేటప్పుడు ఈ తరహా పాలసీలు ఉన్నాయా చూసుకోండి.

ఆసుపత్రిలో చేరితే

ఆరోగ్య బీమాతో పాటు, హాస్పిటల్‌ క్యాష్‌ బెనిఫిట్‌ అనే ప్రత్యేక ప్రయోజనమూ పొదుపు ఖాతా ద్వారా అందుతోంది.  దీని ద్వారా రోజుకు రూ.500 వరకూ చెల్లిస్తాయి. ఇలా 10 రోజుల పాటు అందుకోవచ్చు. చిన్న చిన్న ఖర్చులకు ఇవి ఉపయోగించుకోవచ్చు. ఖాతాదారుల సంక్షేమం కోసం బ్యాంకులు ఈ వెసులుబాటును అందిస్తున్నాయి.

వైద్య పరీక్షలు

ఏడాదికోసారి తమ ఖాతాదారులు అవసరమైన ప్రాథమిక వైద్య పరీక్షలను చేయించుకునేందుకు బ్యాంకులు వీలు కల్పిస్తాయి. ఇలాంటి పరీక్షల వల్ల భవిష్యత్తులో రాబోయే ఆరోగ్య ఇబ్బందులను ముందే గుర్తించవచ్చు. దీనికోసం ఏడాదికోసారి నిర్ణీత మొత్తం చెల్లించడంలాంటివి చేస్తున్నాయి.

మీరు పొదుపు ఖాతా ప్రారంభించే సమయంలో ఈ విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేయండి. పొదుపు ఖాతా రకాన్ని బట్టి, ప్రయోజనాలు మారుతుంటాయి. కాబట్టి, ముందుగా ఏ ఖాతా ఎంచుకుంటే మీకు ఉపయోగకరమో తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఆ తర్వాతే ఖాతాను ప్రారంభించండి.

 ఆర్‌.జాషువా రాజా, నేషనల్‌ మేనేజర్‌ ఉజ్జీవన్‌ స్మాల్‌ ఫైనాన్స్‌ బ్యాంక్‌

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని