ఆవిష్కరణలకు తోడుగా

బరోడా బీఎన్‌పీ పారిబస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. బరోడా బీఎన్‌పీ పారిబస్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చే కంపెనీలపై పెట్టుబడి పెట్టే ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఇది

Published : 16 Feb 2024 00:20 IST

బరోడా బీఎన్‌పీ పారిబస్‌ మ్యూచువల్‌ ఫండ్‌.. బరోడా బీఎన్‌పీ పారిబస్‌ ఇన్నోవేషన్‌ ఫండ్‌ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. పరిశోధనలకు ప్రాధాన్యం ఇచ్చే కంపెనీలపై పెట్టుబడి పెట్టే ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఇది. దాదాపు 80 శాతం నిధులను ఈక్విటీ పెట్టుబడులకే కేటాయిస్తారు. ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 28. కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి.


టెక్‌ కంపెనీలో

 టెక్‌ కంపెనీల్లో పెట్టుబడి పెట్టి, లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఎడిల్‌వైజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ఎడిల్‌వైజ్‌ టెక్నాలజీ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 28. కనీస పెట్టుబడి రూ.100. ఈ పథకం పెట్టుబడులన్నీ ప్రధానంగా టెక్నాలజీ కంపెనీలపై కేంద్రీకృతమై ఉంటాయి. ఎస్‌అండ్‌పీ బీఎస్‌ఈ టెక్‌ టీఆర్‌ఐ సూచీని ఈ పథకం పనితీరుకు కొలమానంగా తీసుకుంటారు.  

కోటక్‌ టెక్నాలజీ ఫండ్‌: కోటక్‌ మహీంద్రా మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఇదే కోవలో ఒక పథకం వచ్చింది. ప్రధానంగా టెక్నాలజీ కంపెనీలపై పెట్టుబడి పెట్టటం కోటక్‌ టెక్నాలజీ ఫండ్‌ ప్రధాన లక్ష్యం. దీని ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 26. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి.


చిన్న షేర్లలో

ఇండెక్స్‌ తరగతికి చెందిన ‘గ్రో నిఫ్టీ స్మాల్‌క్యాప్‌ 250 ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఒక కొత్త పథకాన్ని గ్రో మ్యూచువల్‌ ఫండ్‌ రూపొందించింది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 23. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాలి. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. నిఫ్టీ స్మాల్‌ క్యాప్‌ ఇండెక్స్‌- టీఆర్‌ఐ సూచీతో ఈ పథకం పనితీరును పోల్చి చూస్తారు. ఈ సూచీలో భాగంగా ఉన్న కంపెనీల్లో మంచి పనితీరు కనబరిచే అవకాశం ఉన్న కంపెనీలను ఎంచుకొని ఇది పెట్టుబడి పెడుతుంది.


మార్పులకు అనుగుణంగా

నిఫ్టీ 200 సూచీలో అత్యంత క్రియాశీలకంగా ఉన్న 30 కంపెనీలతో పోర్ట్‌ఫోలియో తయారు చేసి అధిక లాభాలు ఆర్జించటం ‘హెచ్‌డీఎఫ్‌సీ నిఫ్టీ 200 మొమెంటమ్‌ 30 ఇండెక్స్‌ ఫండ్‌’ ప్రధాన లక్ష్యం. నార్మలైజ్డ్‌ మొమెంటమ్‌ స్కోర్‌ (ఎన్‌ఎంఎస్‌) ఆధారంగా ఈ కంపెనీలను ఎంపిక చేస్తారు. మార్కెట్లో చోటు చేసుకుంటున్న మార్పులకు అనుగుణంగా ఈ కంపెనీలు మారుతూ ఉంటాయి. ఈ విధానంలో ‘నిఫ్టీ 200 టీఆర్‌ఐ’కన్నా అధిక లాభాలు వస్తున్నాయని ఇంతవరకూ నిర్ధారణ అయింది. హెచ్‌డీఎఫ్‌సీ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చిన ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 23. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి.


అధిక లాభాల కోసం

హెచ్‌ఎస్‌బీసీ మ్యూచువల్‌ ఫండ్‌ ఒక మల్టీ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌ను రూపొందించింది. హెచ్‌ఎస్‌బీసీ మల్టీ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 22. కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. అన్ని రకాలైన పెట్టుబడి సాధనాల్లో మదుపు చేసి, అధిక లాభాలు ఆర్జించడం, నష్టభయాన్ని తగ్గించుకోవడం ఈ పథకం ప్రధాన వ్యూహం. ఈక్విటీ, రుణ పత్రాలు, బంగారం, వెండి ఈటీఎఫ్‌లు, ఇతర పెట్టుబడి సాధనాలతో ఈ పథకం పోర్ట్‌ఫోలియోను రూపొందిస్తారు.


నూతన రంగాల్లో

యూనియన్‌ బిజినెస్‌ సైకిల్స్‌ ఫండ్‌ పేరుతో యూనియన్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్త పథకాన్ని ఆవిష్కరించింది. ఎప్పటికప్పుడు వెలుగులోకి వస్తున్న నూతన వ్యాపార రంగాల్ని గుర్తించి, ఆ రంగాలకు చెందిన కంపెనీలపై పెట్టుబడి పెట్టి, అధిక లాభాలు నమోదు చేయడం ఈ ఫండ్‌ ప్రధాన లక్ష్యం. ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 27. కనీస పెట్టుబడి రూ.1,000. సంజయ్‌ బెంబాల్కర్‌, హార్దిక్‌ బోరా ఈ పధకానికి ఫండ్‌ మేనేజర్లుగా వ్యవహరిస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని