విభిన్న పథకాల్లో..

పలు రకాలైన పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఒక కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది.

Published : 23 Feb 2024 00:34 IST

లు రకాలైన పెట్టుబడి సాధనాల్లో పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించే లక్ష్యంతో ఒక కొత్త మ్యూచువల్‌ ఫండ్‌ పథకాన్ని క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ఆవిష్కరించింది. ‘క్వాంటమ్‌ మల్టీ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌’ అనే ఈ పథకం కింద సమీకరించిన నిధులను ఈక్విటీ షేర్లలోనే కాకుండా రుణ పత్రాలు, బంగారం- వెండిలోనూ పెట్టుబడి పెడతారు. ఇది హైబ్రీడ్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 1. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.500 పెట్టుబడి పెట్టాలి. తక్కువ నష్టభయంతో, ఒక మోస్తరు ప్రతిఫలం సరిపోతుందనుకునే వారికి ఈ పథకం బాగుంటుంది. దీర్ఘకాలం పాటు పెట్టుబడి కొనసాగిస్తే ప్రయోజనం కనిపిస్తుంది.


పెద్ద, మధ్యస్థాయి కంపెనీలపై

సీఐసీఐ మ్యూచువల్‌ ఫండ్‌, లార్జ్‌- మిడ్‌క్యాప్‌ తరగతికి చెందిన ఇండెక్స్‌ పథకాన్ని తీసుకువచ్చింది. ‘ఐసీఐసీఐ ప్రుడెన్షియల్‌ నిఫ్టీ లార్జ్‌ మిడ్‌క్యాప్‌ 250 ఇండెక్స్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 7న ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి. ప్రధానంగా నిఫ్టీ లార్జ్‌ మిడ్‌క్యాప్‌ 250 సూచీలోని షేర్లను ఎంపిక చేసి, ఆ షేర్లపై పెట్టుబడి పెట్టటం ఈ పథకం ప్రధానోద్దేశం.


ఉత్పత్తి రంగంలో

కెనరా రొబెకో మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఒక కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది. ప్రధానంగా ఉత్పత్తి రంగానికి చెందిన కంపెనీలపై పెట్టుబడి పెట్టి లాభాలు ఆర్జించటం ఈ పథకం ప్రధాన లక్ష్యం. ‘కెనరా రొబెకో మాన్యుఫ్యాక్చరింగ్‌ ఫండ్‌’ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ వచ్చే నెల 1. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.5,000 పెట్టుబడి పెట్టాలి. ఉత్పత్తి రంగం వచ్చే కొన్నేళ్ల పాటు మనదేశంలో అధిక వృద్ధి నమోదు చేస్తుందనే అంచనాలు ఉన్నాయి. తద్వారా ఉత్పత్తి రంగంలోని కంపెనీలు అధిక ఆదాయాలు ఆర్జించే అవకాశం ఉంటుంది. కాబట్టి సంబంధిత కంపెనీలపై పెట్టుబడి పెడితే లాభాలు ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. ఈ పథకం ప్రధాన లక్ష్యమూ అదే.


స్థిరమైన లాభాల కోసం..

హీంద్రా మనులైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌, ‘మహీంద్రా మనులైఫ్‌ మల్టీ అసెట్‌ అలకేషన్‌ ఫండ్‌’ అనే పేరుతో ఒక కొత్త పథకాన్ని రూపొందించింది. ఈక్విటీతో పాటు రుణ పత్రాల్లో, బంగారం/ వెండి ఈటీఎఫ్‌లు, ఈక్విటీ ట్రేడెడ్‌ కమొడిటీ డెరివేటివ్స్‌... తదితర సాధనాల్లో పెట్టుబడి పెడుతుంది. తద్వారా స్థిరమైన లాభాలు ఆర్జించే అవకాశం ఏర్పడుతుంది. ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ వచ్చే నెల 5తో ముగుస్తుంది. ఎన్‌ఎఫ్‌ఓలో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. దీర్ఘకాలిక మదుపరులకు ఈ పథకం అనువుగా ఉంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని