March 31st Deadline: 31లోగా ఇవి పూర్తి చేయండి..

ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం..

Updated : 29 Mar 2024 10:08 IST

ఆర్థిక సంవత్సరం ముగింపు నేపథ్యంలో మార్చి 31 నాటికి పూర్తి చేయాల్సిన కొన్ని పనులు.. ముగుస్తున్న పథకాల వివరాలను పరిశీలిద్దాం..

  • మ్యూచువల్‌ ఫండ్లలో మదుపు చేస్తున్నవారు రీకేవైసీ (మీ ఖాతాదారు గురించి తెలుసుకోండి)ని పూర్తి చేయండి. అధికారిక ధ్రువీకరణలతో కేవైసీ నిబంధనలను పూర్తి చేయని వారు తగిన వివరాలు సమర్పించి, దీన్ని పూర్తి చేయాలి.
  • బ్యాంకుల్లోనూ ఆధార్‌, పాన్‌ కార్డులాంటివి లేకపోతే కేవైసీని అప్‌డేట్‌ చేయాల్సిందిగా సూచిస్తున్నాయి.
  • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) అందిస్తున్న అమృత్‌ కలశ్‌ ప్రత్యేక డిపాజిట్‌ వ్యవధి ముగియనుంది.దీని వ్యవధి 400 రోజులు. వడ్డీ రేటు 7.10 శాతం. సీనియర్లకు 7.6 శాతం వడ్డీ లభిస్తుంది.  
  • సొంతిల్లు కొనాలనుకునే వారికి పలు బ్యాంకులు ప్రత్యేక రాయితీతో మార్చి 31 వరకూ రుణాలను ఇస్తున్నాయి.
  • ఆదాయపు పన్ను రిటర్నులకు సంబంధించి, అప్‌డేటెడ్‌ రిటర్నులు దాఖలు చేయడానికి మార్చి 31 వరకూ గడువుంది. ఆదాయపు పన్ను శాఖ నుంచి నోటీసు వచ్చిన వారు ఈ పనిని పూర్తి చేయాలి. 2021-22, 2022-23, 2023-24 మదింపు సంవత్సరాలకు సంబంధించి వీటిని దాఖలు చేసేందుకు ఆదాయపు పన్ను విభాగం అనుమతినిచ్చింది. వీటిని దాఖలు చేసేటప్పుడు అదనంగా చెల్లించాల్సిన పన్నుపై కొంత వడ్డీ చెల్లించాల్సి రావచ్చు.
  • పన్ను ఆదా పెట్టుబడులు పెట్టేందుకు గడువు ఉంది. కానీ, ఈక్విటీ ఆధారిత పొదుపు పథకాలు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఎంచుకోలేరు. శుక్ర, శని, ఆదివారాలు మార్కెట్‌కు సెలవు. కాబట్టి, ఈఎల్‌ఎస్‌ఎస్‌ దరఖాస్తును ఫండ్‌ సంస్థలు ఆమోదించడం సాధ్యం కాదు. అంటే, ఇప్పుడు మదుపు చేసినా, అవి వచ్చే ఆర్థిక సంవత్సరం ఖాతాలోకి వెళ్తాయి.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని