ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది

Updated : 19 Apr 2024 13:42 IST

ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్‌)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో చాలామంది ఇప్పుడే పన్ను రిటర్నులు దాఖలు చేద్దామని అనుకుంటున్నారు. ఆదాయం, టీడీఎస్‌, మినహాయింపుల్లాంటి పూర్తి వివరాలు లేకుండా రిటర్నులు దాఖలు చేయడం మంచిది కాదు అని నిపుణులు సూచిస్తున్నారు.

 ఆదాయపు పన్ను శాఖ నిబంధనల మేరకు ఉద్యోగులకు యాజమాన్యాలు జూన్‌ 15లోగా ఫారం-16లు అందించాల్సి ఉంటుంది. ఈలోపు ఫారం 26ఏఎస్‌తో పాటు, వార్షిక సమాచార నివేదిక (ఏఐఎస్‌)లూ అప్‌డేట్‌ అవుతాయి. ఇవన్నీ పూర్తిగా అందుబాటులోకి వచ్చాకే పన్ను దాఖలు చేయడం మంచిదని పన్ను నిపుణులు పేర్కొంటున్నారు.

 ఇఫైలింగ్‌ వెబ్‌సైటులో ముందే భర్తీ చేసిన ఐటీఆర్‌-1 అందుబాటులో ఉంది. కానీ, ఈ ఆర్థిక సంవత్సరం డిసెంబరు వరకే ఆదాయం, టీడీఎస్‌ వివరాలు నమోదయ్యాయి. జనవరి-మార్చి త్రైమాసికానికి సంబంధించి, ఆదాయం, టీడీఎస్‌ వివరాలు ఇంకా కనిపించడం లేదు. మీరు యాజమాన్యానికి సమర్పించిన గృహరుణ వడ్డీ, ఇతర మినహాయింపులనూ క్లెయిం చేసుకోవడంలో ఇబ్బంది ఎదురవుతుంది. కాబట్టి, మొత్తం ఆదాయం, పన్ను కోత, మినహాయింపుల వివరాలు లేకుండా రిటర్నులు వేయడం సరికాదు. అన్ని వివరాలూ వచ్చే వరకూ ఆగి, ఆ తర్వాతే ఎలాంటి తప్పులూ లేకుండా రిటర్నులు దాఖలు చేయడం ఉత్తమం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. రిటర్నులను జులై 31లోగా దాఖలు చేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని