ప్రభుత్వ సంస్థల్లో

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ నిఫ్టీ పీఎస్‌ఈ ఈటీఎఫ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఎస్‌) ఇండెక్స్‌ ఆధారంగా రూపొందించిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఇది.

Published : 03 May 2024 00:38 IST

ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ కొత్తగా ఒక ఈటీఎఫ్‌ (ఎక్స్ఛేంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్‌) పథకాన్ని తీసుకొచ్చింది. ఆదిత్య బిర్లా సన్‌ లైఫ్‌ నిఫ్టీ పీఎస్‌ఈ ఈటీఎఫ్‌ అనే ఈ పథకం ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. నిఫ్టీ పబ్లిక్‌ సెక్టార్‌ ఎంటర్‌ప్రైజెస్‌ (పీఎస్‌) ఇండెక్స్‌ ఆధారంగా రూపొందించిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం ఇది. దేశంలోని అగ్రశ్రేణి ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడి పెట్టే అవకాశం ఈ పథకం ద్వారా మదుపరులకు లభిస్తుంది. దేశ ఆర్థిక వ్యవస్థ 2047 నాటికి 7 ట్రిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. ఈ క్రమంలో ప్రభుత్వ రంగ సంస్థలు అత్యంత క్రియాశీలకమైన పాత్ర పోషిస్తాయి. ఎన్నో కీలక రంగాల్లో ప్రభుత్వ సంస్థలు నాయకత్వ స్థానాల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే కొన్నేళ్లపాటు ఈ కంపెనీలు వృద్ధి బాటలో కొనసాగుతాయని, తద్వారా మంచి పెట్టుబడి అవకాశాలను కల్పిస్తాయని అంచనా. ఇలాంటి ప్రభుత్వ సంస్థలపై పెట్టుబడి పెట్టే ఈ పథకం దీర్ఘకాలిక మదుపరులకు అనుకూలంగా ఉంటుంది.


హెచ్చుతగ్గులు తక్కువగా

ఎడిల్‌వైజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ నుంచి ఎడిల్‌వైజ్‌ నిఫ్టీ ఆల్ఫా లో వోలటైలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌ అనే కొత్త పథకం అందుబాటులోకి వచ్చింది. నిఫ్టీ ఆల్ఫా లో వోలటైలిటీ 30 ఇండెక్స్‌ ఫండ్‌ గత రెండు దశాబ్దాలుగా నిఫ్టీ 100 టీఆర్‌ఐ ఇండెక్స్‌కు మించి ప్రతిఫలాన్ని అందించిన విషయం ఈ సందర్భంగా గమనార్హం. అయిదేళ్ల కాలంలో నిఫ్టీ ఆల్ఫా లో వోలటైలిటీ 30 ఇండెక్స్‌, నిఫ్టీ 100 టీఆర్‌ఐ కంటే 5.2 శాతం అధిక వృద్ధి నమోదు చేసింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త పథకాన్ని ఎడిల్‌వైజ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. ఎన్‌ఎఫ్‌ఓ ఈ నెల 10వ వరకూ అందుబాటులో ఉంటుంది. కనీసం రూ.100 పెట్టుబడి పెట్టాలి. ఇది ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. పోర్ట్‌ఫోలియోను నిర్మించడం కోసం 150 అగ్రశ్రేణి కంపెనీల నుంచి 30 కంపెనీలను ఎంచుకుంటారు. దాదాపుగా నిఫ్టీ ఆల్ఫా లో వోలటైలిటీ 30 ఇండెక్స్‌లో ఉన్న కంపెనీలను పోలిన రీతిలో పోర్ట్‌ఫోలియో ఉంటుంది. ఇందులో పెట్టుబడిపై దీర్ఘకాలంలో తక్కువ నష్టభయం, అధిక ప్రతిఫలాన్ని ఆర్జించటానికి అవకాశం ఉంది.


వినియోగ వస్తువుల కంపెనీల్లో

నిఫ్టీ నాన్‌-సైక్లికల్‌ కన్జూమర్‌ ఇండెక్స్‌ ఫండ్‌ ఆధారిత కొత్త పథకాన్ని గ్రో మ్యూచుల్‌ ఫండ్‌ తీసుకొచ్చింది. గ్రో నిఫ్టీ-నాన్‌ సైక్లికల్‌ కన్జూమర్‌ ఇండెక్స్‌ ఫండ్‌ అనే కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. ఎన్‌ఎఫ్‌ఓ ముగింపు తేదీ ఈ నెల 16. కనీస పెట్టుబడి రూ.500. ఇండెక్స్‌ తరగతికి చెందిన ఓపెన్‌ ఎండెడ్‌ పథకం. దీని కింద సమీకరించిన నిధులను ప్రధానంగా వినియోగ వస్తువులు, సేవలను అందించే కంపెనీలపై పెట్టుబడిగా పెడతారు. ప్రజలు నిత్యం కొనుగోలు చేసే ఎఫ్‌ఎంసీజీ, దుస్తులు, విలాస వస్తువులను అందించే కంపెనీలపై పెట్టుబడి పెట్టడం ఈ ఫండ్‌ ప్రధాన లక్ష్యం. ఈ కంపెనీలపై స్థూల ఆర్థిక వ్యవస్థ, ఆర్థిక స్థితిగతుల ప్రభావం తక్కువగా ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే.. ఆర్థిక మాంద్యం ప్రభావానికి లోనుకాని కంపెనీలుగా వీటిని చెప్పొచ్చు. ఇలాంటి కంపెనీలపై పెట్టుబడి దీర్ఘకాలంలో స్థిరమైన లాభాలు ఆర్జించేందుకు అవకాశం ఉంటుంది. ఈ పథకం పనితీరుకు నిఫ్టీ నాన్‌- సైక్లికల్‌ కన్జూమర్‌ ఇండెక్స్‌ ఫండ్‌ను కొలమానంగా తీసుకుంటారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు