Education: విదేశాల్లో విద్యనభ్యసించాలనుకునేవారు ఖర్చులను ఎలా మేనేజ్ చేయాలి?
విదేశాలలో ఫీజులతో పాటు ఇతర ఖర్చులు భారీగానే ఉంటాయి. ఆ ఖర్చులను తట్టుకోవడానికి ప్రణాళికగా ఎలా ఉండాలో ఇక్కడ చూడండి.
ఇంటర్నెట్ డెస్క్: విదేశాల్లో విద్యనభ్యసించాలనేది ఎంతో మంది భారత విద్యార్థుల బలమైన కోరిక. విదేశాల్లో సరసమైన విద్యను పొందే దిశగా కలలు కంటున్నప్పుడు, అక్కడ ఖర్చులను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. అయితే, అక్కడ మంచి విశ్వవిద్యాలయంలో సీటు లభించడం దగ్గర నుంచి అనేక ఖర్చులు ఉంటాయి.
ఖర్చులు
విదేశీ విద్యకు ఖర్చులే పెద్ద ఆందోళన. విదేశాల్లో విద్యను అభ్యసించాలని నిర్ణయించుకున్నప్పుడు వసతి, ఆహారం, రవాణా, అదనపు ఖర్చులు చాలా ఎక్కువ. ట్యూషన్ ఫీజులు, విమాన ఛార్జీలు, ఇన్సూరెన్స్‌తో పాటు రోజువారీ జీవన వ్యయాలు వంటి ఖర్చులుంటాయి. ట్యూషన్ ఫీజులు.. విశ్వవిద్యాలయాలు/కళాశాలల మధ్య విస్తృతంగా మారుతూ ఉంటాయి. వివిధ దేశాలు, ప్రాంతాల మధ్య జీవన వ్యయాలు, ప్రయాణ, బీమా ఖర్చులు కూడా మారుతూ ఉంటాయి. అందుచేత ఈ ఖర్చుల బడ్జెట్‌ను సెట్ చేసుకోవడానికి ఆన్‌లైన్‌లో కొంచెం పరిశోధన చేయాల్సి ఉంటుంది.
ఆర్థిక మద్దతు కోసం
మీ చదువులకు అంతరాయం కలగకుండా సాధ్యమైనంత వరకు సాఫీగా సాగేందుకు సరైన ఆర్థిక ప్రణాళిక, పొదుపు చాలా అవసరం. విదేశీ విద్యకు ప్లాన్ చేసేటప్పుడు ప్రణాళికలో స్కాలర్‌షిప్‌లు/ గ్రాంట్లు, ముందస్తు పొదుపు, విద్యారుణాలు వంటి అంశాలను కలిగి ఉండాలి. మీ ప్రవేశానికి ఒక సంవత్సరం ముందు పరిశోధించి, తదనుగుణంగా సిద్ధం అవ్వాలి. విద్యార్థి విదేశాల్లో ఉన్నప్పుడు అన్ని అధ్యయన ఖర్చులను చూసుకునే స్పాన్సర్ కోసం ప్రయత్నించవచ్చు. అలాగే, తక్కువ వడ్డీకి సాఫ్ట్ లోను అందించడానికి స్పాన్సర్‌ను ఒప్పించవచ్చు. ఈ ఎంపికను కలిగి ఉన్న వెబ్‌సైట్‌లు/ ఏజెన్సీల కోసం సెర్చ్ చేయొచ్చు లేదా ఆర్థిక సహాయాన్ని పొందడంలో మీకు సహాయపడే స్థానిక ఏజెన్సీల కోసం కూడా ప్రయత్నించొచ్చు. విద్యార్థికి స్కాలర్‌షిప్‌లు లేదా గ్రాంట్లు లేనట్లయితే.. వారి తల్లిదండ్రుల ఆర్థిక మద్ధతుపై ఆధారపడవలసి ఉంటుంది. లేదా చాలా సందర్భాలలో విద్యా రుణం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
సొంతంగా పెట్టుబడి
విదేశాల్లో విద్య కోసం డబ్బును సేకరించేందుకు, కొన్ని సంవత్సరాల ముందు నుంచే మీరు SIP ప్రారంభించవచ్చు. ముందుగా అనుకున్న మొత్తాన్ని మ్యూచువల్ ఫండ్ స్కీంలో SIP చేయడం ద్వారా పెట్టుబడులను సొంతంగా సముకూర్చుకోవచ్చు. విద్యార్థిగా విదేశాలకు వెళ్లాలని ప్లాన్ చేసినప్పుడు స్మార్ట్ ఫైనాన్సింగ్‌కు ఇది ఒక మార్గం.
ఇతర మార్గాలు
పూర్వ విద్యార్థుల నెట్‌వర్క్‌కు దరఖాస్తు చేసుకున్నట్లైతే.. విద్యార్థి గ్రేడ్‌లు, మునుపటి విద్యా పనితీరు, ఫండ్ అవసరాలకు గల కారణాలు నెట్‌వర్క్ ద్వారా అంచనా వేస్తారు. మీ దరఖాస్తు ప్రామాణికమైనదిగా పరిగణిస్తే దరఖాస్తుదారునికి సహాయం అందుతుంది. ఇది పూర్తిగా కాకుండా కొంతవరకు విద్యార్థికి ఆర్థికంగా సహాయపడుతుంది. అంతేకాకుండా, ట్యూషన్ ఫీజు చెల్లించే విషయంలో యూనివర్సిటీ మేనేజ్‌మెంట్ నుంచి సౌలభ్యం కోసం అడగవచ్చు. అంటే, ఫీజు ఒక్కసారిగా కాకుండా వాయిదాలలో ఫీజు చెల్లించడానికి అనుమతిని అడగవచ్చు. అనేక విదేశీ విశ్వవిద్యాలయాలు, విద్యార్థుల తల్లిదండ్రులు ఉద్యోగాలు కోల్పోయినప్పుడు లేదా వైద్య పరిస్థితుల విషయంలో ఆర్థిక సహాయాన్ని అందిస్తాయి.
పార్ట్-ఆన్‌లైన్, పార్ట్ ఆన్-క్యాంపస్ కోర్సులు
కొవిడ్ కారణంగా విద్యా కోర్సులు.. ఇల్లు+క్యాంపస్ వంటి హైబ్రిడ్ మోడల్‌కు దారి తీశాయి. ఈ అభ్యాస విధానం విద్యార్థికి ఫీజు ఖర్చుల పరంగా సరసమైనది. విదేశాల్లో ఉన్న విశ్వవిద్యాలయాలలో సుదీర్ఘమైన దరఖాస్తు, ప్రవేశ విధానాన్ని వ్యతిరేకించే వారికి గొప్ప ఎంపికగా ఈ హైబ్రిడ్ విధానం సరిపోతుంది. అంతేకాకుండా విద్యార్థులు వారి సాధారణ తరగతులకు హాజరవుతున్నప్పుడు పార్ట్-టైమ్ ఉద్యోగాలు చేయడానికి అనుమతి ఉంటుంది. విద్యా రుణ రీపేమెంట్ విషయంలో పార్ట్ టైమ్ సంపాదన బాగా ఉపయోగపడుతుంది. ఇది దీర్ఘకాలికంగా మీపై భారాన్ని తగ్గిస్తుంది.
ఖర్చు తగ్గింపు మార్గాలు
తోటి విద్యార్థులతో వసతితో పాటు ఇంటర్నెట్ ఖర్చులను పంచుకోండి. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను వినియోగించండి. షాపింగ్ కోసం డిస్కౌంట్ కూపన్ల కోసం చూడండి. కాల్ చేయడానికి స్కైప్/డిస్కౌంట్ ఫోన్ కార్డులను ఉపయోగించండి. మీ విమాన ఛార్జీలు, ఆరోగ్య బీమా కోసం ఆన్‌లైన్‌లో షాపింగ్ చేయండి.
చివరిగా: విదేశీ విద్య కోసం ప్రయత్నించే విద్యార్థులు ఆన్‌లైన్‌లో ఆ వివరాలను సెర్చ్ చేయడమే కాకుండా, అప్పటికే విదేశాల్లో విద్యనభ్యసించిన పూర్వ విద్యార్థులను సంప్రదించడం మంచిది. వీరితో చర్చలు అనుభవపూర్వకమైన ఫలితాలనిస్తాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
Dhoni - IPL: పెయింటర్‌గానూ అదరగొట్టిన ధోనీ.. వీడియో వైరల్!
-
Politics News
KTR: బండి సంజయ్, రేవంత్ ఒక్కసారైనా పరీక్ష రాశారా?: కేటీఆర్
-
General News
TSPSC: టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ. . మరో వ్యక్తి అరెస్టు
-
Movies News
Manoj: ఆ వివాదం గురించి.. వాళ్లనే అడగండి: మంచు మనోజ్
-
India News
Yediyurappa: యడియూరప్ప ఇంటిపై దాడి.. రాళ్లు విసిరిన నిరసనకారులు..!
-
General News
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు