Financial Goals: ఆర్థిక లక్ష్యాలంటే ఏంటి? ఎలా ప్లాన్‌ చేసుకోవాలి?

ప్రతి ఒక్కరికి జీవితంలో కొన్ని లక్ష్యాలుంటాయి. అవి నెరవేర్చుకోవడానికి డబ్బు అవసరం పడుతుంది. దీని కోసం ఎలాంటి ప్రణాళిక ఉండాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి?

Published : 01 Dec 2023 15:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రతి వ్యక్తికి అనేక లక్ష్యాలుంటాయి. ప్రతి లక్ష్యం కోసం ఒకే పెట్టుబడి పథకాన్ని ఎంచుకోలేం. కష్టపడి సంపాదించిన డబ్బును దృఢమైన నిర్మాణాత్మక ఆర్థిక ప్రణాళిక ప్రకారం పెట్టుబడి పెట్టడం వల్ల అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. భారతీయ పెట్టుబడిదారుల్లో చాలా మంది మదుపు బాగానే చేస్తుంటారు. అయితే, ఏ లక్ష్యానికి ఎంత పెట్టుబడి పెట్టాలి? ఎంత కాలం పెట్టుబడి పెట్టాలి? అనేది సరిగ్గా అంచనా వేయలేక గందరగోళానికి గురవుతారు. కొంతమంది ఆర్థిక లక్ష్యాలను సరిగ్గా పట్టించుకోకుండా క్రమపద్ధతిగా కాకుండా తోచిన పథకంలో పెట్టుబడి పెట్టేస్తూ ఉంటారు. వీటిలో గుడ్డిగా మదుపు చేయడం వల్ల ఆర్థిక లక్ష్యం నెరవేరదు. మన దేశంలో ఇప్పటికీ లక్ష్య ఆధారిత ఆర్థిక ప్రణాళిక ప్రారంభ దశలోనే ఉంది. దీనికి గాను ప్రతి ఒక్కరూ తమ లక్ష్యానికి అనుగుణంగా ప్రణాళికతో వ్యవహరించాలి.

అధిక రాబడి

అధిక రాబడి ఆశించేవారు చిన్న వయసులోనే పెట్టుబడిని ప్రారంభించడం మంచిది. వీరికి రిస్క్‌ తీసుకునేందుకు సమయం పుష్కలంగా ఉంటుంది. దీనివల్ల రాబడికి సంబంధించిన అధిక ప్రయోజనాన్ని పొందొచ్చు. వీరు పెట్టుబడి సామర్థ్యాన్ని నిర్ణయించుకుని సరైన ఆస్తులను ఎంచుకోవాలి. తదనుగుణంగా పెట్టుబడులను కేటాయించాలి. చిన్న వయసులో చేసే పెట్టుబడులు కొంత కాలం బాగా పనిచేయకపోయినా, తాత్కాలిక నష్టాల గురించి ఎక్కువ ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు.

లక్ష్య ఆధారిత ఆర్థిక ప్రణాళిక

ఆర్థిక ప్రణాళికలో స్వల్పకాలిక, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను సాధించడానికి సరైన కార్యచరణ ప్రణాలికను రూపొందించుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాలను ఇలా వర్గీకరించవచ్చు..
స్వల్పకాలిక లక్ష్యాలు: 1-3 సంవత్సరాల కాలపరిమితితో

మధ్యకాలిక లక్ష్యాలు: 3-7 సంవత్సరాల కాలపరిమితితో

దీర్ఘకాలిక లక్ష్యాలు: 7-10+ సంవత్సరాల కాలపరిమితితో

మీరు సంపాదించిన డబ్బును పెట్టుబడి పెట్టాలనుకున్నప్పుడు ముందుగా మీ రిస్క్‌ ప్రొఫైల్‌, ఆర్థిక పరిస్థితిని విశ్లేషించి, ఆపై నిర్మాణాత్మక ఆర్థిక ప్రణాళికను రూపొందించుకుని ముందుకెళ్లాలి. స్వల్పకాలిక లక్ష్యాల కోసం, మీరు బ్యాంకు డిపాజిట్లు/డెట్‌ ఫండ్‌లలో పెట్టుబడులు పెట్టొచ్చు. దీర్ఘకాల లక్ష్యాల కోసం షేర్లు లేదా మ్యూచువల్‌ ఫండ్‌లలో పెట్టుబడి పెట్టవచ్చు.

ఏ లక్ష్యానికి ఎక్కడ మదుపు చేయాలో ఈ కింది పట్టికను చూడండి...

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు