iPhone 16 launched: ఐఫోన్‌ 16 సిరీస్‌ ఫోన్లు వచ్చేశాయి.. ధర, ఫీచర్లు ఇవే..

Eenadu icon
By Business News Team Updated : 10 Sep 2024 12:33 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
3 min read

కాలిఫోర్నియా: అందరూ ఎదురుచూస్తున్న ఐఫోన్‌ 16 ఫోన్లు రానే వచ్చాయి. యాపిల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో మరింత శక్తిమంతంగా ఇవి రూపొందాయి. అధునాతన కెమెరా కంట్రోల్‌ ఫీచరుతో పాటు కొత్త బటన్లు ఉన్నాయి. ప్రత్యేకంగా తయారైన కొత్త చిప్‌ ఏ18తో వచ్చింది. ఐఫోన్‌ 16 మోడళ్లతోపాటు యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10, వాచ్‌ అల్ట్రా, ఎయిర్‌పాడ్స్‌ 4, ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్, ఎయిర్‌పాడ్స్‌ ప్రొ 2లను సోమవారం ఇక్కడ ఆవిష్కరించింది. ‘ఇట్స్‌ గ్లోటైమ్‌’ పేరిట నిర్వహించిన ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ ఉత్పత్తుల విశేషాలను పంచుకున్నారు.

ఐఫోన్‌ 16 సిరీస్‌: ఇందులో ఐఫోన్‌ 16, ఐఫోన్‌ 16 ప్లస్, ఐఫోన్‌ 16 ప్రొ, ఐఫోన్‌ 16 ప్రొ మ్యాక్స్‌.. అనే నాలుగు మోడళ్లను యాపిల్‌ తీసుకొచ్చింది. గూగుల్‌ పిక్సెల్‌ 9, శాంసంగ్‌ గెలాక్సీ ఎస్‌24లో అందుబాటులోకి వచ్చిన ఏఐ సాంకేతికత తరహాలో యాపిల్‌ ఇంటెలిజెన్స్‌(ఏఐ)తో వీటిని తీసుకొచ్చింది. చాలా వరకు ఏఐ టాస్క్‌లు రిమోట్‌ డేటా సెంటర్లకు బదులుగా ఐఫోన్‌లోనే పూర్తవుతాయి. కొత్త ఫోన్లు ఐఓఎస్‌18తో పనిచేస్తాయి.

ఐఫోన్‌ 16, 16 ప్లస్‌

రెండు సైడ్‌ బటన్లు: కెమెరా కంట్రోల్‌ బటన్, యాక్షన్‌ బటన్‌ అనే రెండు కొత్త బటన్లను జత చేశారు. కెమెరా కంట్రోల్‌ బటన్‌ ద్వారా ‘విజువల్‌ ఇంటెలిజెన్స్‌’తో మాక్రో ఫొటోలు, స్పేషియల్‌ ఫొటోలు/వీడియోలు తీసుకోవచ్చు.  
రెండు కెమెరా లెన్స్‌లు: 48 ఎమ్‌పీ ప్రధాన కెమెరా ఉంటుంది. డాల్బీ విజన్‌లో 4కే60 వీడియోను తీసుకోవచ్చు. వీడియోల్లో గాలి ధ్వనిని తగ్గించొచ్చు.

  • ఐదు రంగుల్లో లభ్యం.
  • ఈనెల 20 నుంచి వీటిని కొనుగోలు చేయొచ్చు.

హెల్త్‌ ఫీచర్లతో.. యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 10

ఏరోస్పేస్‌ గ్రేడ్‌ టైటానియం కేస్‌తో రూపొందించిన యాపిల్‌ వాచ్‌ 10లో వైడ్‌ యాంగిల్‌ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లే ఉంది. సిరీస్‌ 9తో పోలిస్తే స్క్రీన్‌ ఏరియా 30% ఎక్కువగా, 10% తక్కువ మందం (9.7 ఎంఎం)తో, 20% తక్కువ బరువుతో ఉంటుంది. మూడు రంగుల్లో లభ్యమయ్యే ఈ వాచ్‌లో స్లీప్‌ అప్నియా డిటెక్షన్‌ వంటి ఆరోగ్య ఫీచరును జత చేసింది. 18 గంటల పాటు బ్యాటరీ పనిచేస్తుంది. జీపీఎస్‌తో పనిచేసేది 399 డాలర్లు, జీపీఎస్‌+సెల్యులార్‌ మోడల్‌ ధర 499 డాలర్లు.

అథ్లెట్ల కోసం డిజైన్‌ చేసిన యాపిల్‌ వాచ్‌ అల్ట్రా 2ను పారాచూట్‌ తరహా లాక్‌ఇన్‌ మెకానిజంతో తీసుకొచ్చింది. శాటిన్‌ నలుపు రంగులోని ఈ వాచీల ప్రారంభ ధర 799 డాలర్లు. వీటి విక్రయాలు ఈనెల 20 నుంచి మొదలవుతాయి.

  • ఎయిర్‌పాడ్స్‌ 4: సరికొత్త లుక్‌తో ఎయిర్‌పాడ్స్‌ 4ను యాపిల్‌ ఆవిష్కరించింది. వర్చువల్‌ అసిస్టెంట్‌ ‘సిరి’కి కనెక్ట్‌ కావాలంటే కేవలం మీ తలను ఆడిస్తే చాలు. యూఎస్‌బీ-సి ఛార్జింగ్‌ పోర్టుతో ఎయిర్‌పాడ్స్‌ 4 కేస్‌ను తీసుకొచ్చారు. 30 గంటలపాటు బ్యాటరీ, యాక్టివ్‌ నాయిస్‌ క్యాన్సిలేషన్, వాయిస్‌ ఐసొలేషన్, పర్సనలైజ్డ్‌ స్పేషియల్‌ ఆడియో, ఫర్స్‌ సెన్సార్స్‌ వంటి పలు ఫీచర్లున్నాయి.

ప్రారంభ ధర: 129 డాలర్లు, నాయిస్‌ క్యాన్సిలేషన్‌ మోడల్‌ ధర 179 డాలర్లు
ఎయిర్‌పాడ్స్‌ మ్యాక్స్‌: ఈ హెడ్‌ఫోన్స్‌ను యూఎస్‌బీ-సి పోర్టుతో ఛార్జింగ్‌ చేసుకోవచ్చు. ఐదు రంగుల్లో (మిడ్‌నైట్, బ్లూ, పర్పుల్, ఆరంజ్, స్టార్‌లైట్‌) లభ్యమవుతాయి.
ప్రారంభధర: 549 డాలర్లు

Tags :
Published : 10 Sep 2024 00:47 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు