Mobile subscribers: జియో, ఎయిర్‌టెల్‌ జోరు.. వీఐ, బీఎస్‌ఎన్‌ఎల్‌ వలసలతో బేజారు..

Mobile subscribers: బీఎస్‌ఎన్‌ఎల్‌, వొడాఫోన్‌ ఐడియా మరోసారి భారీగా కస్టమర్లను కోల్పోయాయి. అదే సమయంలో జియో, ఎయిర్‌టెల్‌ చందాదారులను పెంచుకున్నాయి.

Published : 25 Aug 2023 17:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థలైన రిలయన్స్‌ జియో (Reliance Jio), భారతీ ఎయిర్‌టెల్‌ (Bharti Airtel) టెలికాం మార్కెట్‌లో తమ హవా కొనసాగిస్తున్నాయి. చందాదారులను పెంచుకోవటంలో చాలా కాలంగా ఉన్న ట్రెండ్‌ను కొనసాగిస్తున్నాయి. అదే సమయంలో వొడాఫోన్ ఐడియా (Vodafone Idea), ప్రభుత్వం రంగ సంస్థ భారత్ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్ (BSNL) పెద్ద ఎత్తున సబ్‌స్క్రైబర్లను కోల్పోయాయి. టెలికాం సంస్థలకు సంబంధించిన జూన్‌ నెల డేటాను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్‌ (TRAI) విడుదల చేసింది. 

జులై నెలలో జియో 2.27 మిలియన్‌ కస్టమర్లను పెంచుకోగా.. ఎయిర్‌టెల్‌కు 1.4 మిలియన్ల చందాదారులు వచ్చి చేరారని ట్రాయ్‌ తెలిపింది. అదే సమయంలో వీఐ నుంచి 1.2 మిలియన్ల మంది, బీఎస్‌ఎన్‌ఎల్ నుంచి 1.8 మిలియన్ల మంది వలస వెళ్లారని పేర్కొంది. దీంతో జులై ముగిసే సమయానికి మొత్తం టెలికాం మార్కెట్‌లో జియో వాటా 38.35 శాతంతో మొదటి స్థానంలో ఉండగా.. 32.68 శాతంతో ఎయిర్‌టెల్ రెండో స్థానంలో నిలిచింది. వీఐ 20.08 శాతం, బీఎస్‌ఎన్‌ఎల్‌ 8.71 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

కొత్త ఈవీ పాలసీ వైపు భారత్‌ అడుగులు?.. అలా చేస్తే విదేశీ కార్లకు ఈజీ ఎంట్రీ!

ఇక యాక్టీవ్‌ సబ్‌స్క్రైబర్ల విషయానికొస్తే.. 414.49 మిలియన్‌ యాక్టీవ్ చందాదారులతో రిలయన్స్‌ జియో అగ్రస్థానంలో నిలిచింది. ఎయిర్‌టెల్‌ 372.77 మిలియన్‌ వినియోగదారులతో రెండో స్థానంలో నిలిచింది. వీఐ 202.75 మిలియన్ యూజర్లతో, బీఎస్‌ఎన్ఎల్‌ 52.04 మిలియన్‌ యూజర్లతో తర్వాత స్థానాల్లో నిలిచాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని