Jio Offer: జియో రిపబ్లిక్‌ డే ఆఫర్‌.. ఏడాది ప్లాన్‌పై స్విగ్గీ, అజియో కూపన్లు

Jio Republic Day Offer: ప్రముఖ టెలికాం కంపెనీ జియో ఇప్పటికే అందిస్తున్న రూ.2,999 రీఛార్జి ప్లాన్‌పై రిపబ్లిక్‌ డే ఆఫర్‌ కింద కూపన్‌ ప్రయోజనాలు అందిస్తోంది.

Updated : 23 Jan 2024 15:00 IST

Jio Offer | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) ‘రిపబ్లిక్‌ డే ఆఫర్‌ (Republic Day Offer)’ ప్రకటించింది. ఏడాది కాలపరిమితి కలిగిన రూ.2,999 ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌పై ‘హ్యాపీ న్యూ ఇయర్‌ ఆఫర్‌ 2024’ పేరిట అదనపు వ్యాలిడిటీని తీసుకొచ్చిన జియో.. తాజాగా అదే ప్లాన్‌పై కొన్ని కూపన్లను అందిస్తోంది. జనవరి 15 నుంచి జనవరి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. లాంగ్‌ టర్మ్‌ ప్లాన్‌ కోసం ఎదురుచూస్తున్నవారు ఈ ప్లాన్‌ను పరిశీలించొచ్చు.

జియో అందిస్తున్న రూ.2,999తో రీఛార్జి చేసుకునే ప్రీపెయిడ్‌ వినియోగదారులకు 365 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. అన్‌లిమిటెడ్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు 2.5 జీబీ డేటా చొప్పున మొత్తం 912.5 జీబీ డేటా లభిస్తుంది. జియో క్లౌడ్, జియో టీవీ, జియో సినిమా ఏడాది పాటు ఉచితంగా వీక్షించవచ్చు. ‘రిపబ్లిక్‌ డే’ ఆఫర్‌లో భాగంగా రీఛార్జ్‌ చేసుకున్న వారికి అదనంగా నెట్‌మెడ్స్‌, అజియో, ఇక్సిగో, తిరా, స్విగ్గీ కూపన్లను జియో అందిస్తోంది.

మీ ఫాస్టాగ్‌ స్టేటస్‌ ఏంటి? కేవైసీ ఎలా పూర్తి చేయాలి?

అజియో (Ajio)లో రూ.2,499 పైగా షాపింగ్‌ చేస్తే రూ.500 డిస్కౌంట్‌ లభిస్తుంది. ఆన్‌లైన్‌ బ్యూటీ ప్రొడక్ట్‌ ప్లాట్‌ఫామ్‌ తిరా (Tira)లో రూ.వెయ్యి, అంత కంటే ఎక్కువ మొత్తంలో చేసే కొనుగోళ్లపై 30శాతం డిస్కౌంట్‌ ఉంటుంది. ఇక్సిగో (Ixigo)లో విమాన టికెట్ల బుకింగ్‌పై రూ.1,500 తగ్గింపు పొందొచ్చు. స్విగ్గీ (Swiggy) ద్వారా చేసే కొనుగోళ్లపై రూ.125 విలువైన రెండు డిస్కౌంట్‌ కూపన్లు రీఛార్జి ద్వారా లభిస్తాయి. రిలయన్స్‌ డిజిటల్‌లో  రూ.5వేల కొనుగోలుపై 10శాతం రాయితీ ఉంటుంది. ఈ ప్లాన్‌ను మై జియో యాప్‌/ వెబ్‌సైట్‌ నుంచి పొందొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని