Fastag: మీ ఫాస్టాగ్‌ స్టేటస్‌ ఏంటి? కేవైసీ ఎలా పూర్తి చేయాలి?

fastag KYC: మీ ఫాస్టాగ్‌ కేవైసీని పూర్తి చేశారా? లేదంటే వెంటనే ఆ ప్రక్రియ పూర్తి చేయండి. లేకపోతే   డీయాక్టివేట్‌ అయ్యే ప్రమాదం ఉంది. 

Updated : 16 Jan 2024 15:43 IST

fastag KYC | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫాస్టాగ్‌ల (fastag) విషయంలో జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) కీలక నిర్ణయం తీసుకుంది. కేవైసీ (KYC) పూర్తి చేయని ఫాస్టాగ్‌లను డీయాక్టివేట్‌ చేస్తామని స్పష్టం చేసింది. ఇందుకు 2024 జనవరి 31ని గడువు తేదీగా నిర్ణయించింది. ఒకే వాహనం   ఒకే ఫాస్టాగ్‌ ఉండాలన్న ఉద్దేశంతో NHAI ఈ నిర్ణయం తీసుకుంది.

ఒక వాహనానికి ఒకటి కంటే ఎక్కువ ఫాస్టాగ్‌లు ఉండటం, ఒకే ఫాస్టాగ్‌ను వేర్వేరు వాహనాలకు వినియోగించడం వంటి చర్యలు రహదారుల సంస్థ దృష్టికి వచ్చాయి. కొన్ని సందర్భాల్లో కేవైసీ పూర్తి కాకుండానే ఫాస్టాగ్‌లు జారీ చేస్తున్నట్లు గుర్తించింది. ఫాస్టాగ్‌లను వాహనం ముందుభాగంలో పెట్టకుండా ఇష్టానుసారంగా అతికిస్తుండటంతో టోల్‌ప్లాజాల వద్ద జాప్యం జరుగుతున్నట్లు గుర్తించిన NHAI..  వీటికి చెక్‌ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. 

మారుతీ సుజుకీ కార్ల ధరల పెంపు.. ఎంతంటే?

మీ ఫాస్టాగ్‌ స్టేటస్‌ ఏంటి?

టోల్‌ ఫీజు చెల్లింపుల కోసం వాహన అద్దానికి స్టిక్కర్‌లా అతికించే ఫాస్టాగ్‌లను బ్యాంకు శాఖలు, టోల్‌ ప్లాజాలు, ప్రాంతీయ రవాణా కార్యాలయాలు, కామన్‌ సర్వీస్‌ పాయింట్లు, ట్రాన్స్‌పోర్ట్‌ హబ్స్‌, పెట్రోల్‌ బంకుల వద్ద కొనుగోలు చేయొచ్చు. ఇందుకోసం వాహనం ఆర్‌సీ, చిరునామా, గుర్తింపుకార్డు, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫొటో అవసరం. ఒకవేళ మీ ఫాస్టాగ్‌ స్థితిని తెలుసుకోవాలంటే ఫాస్టాగ్‌ వెబ్‌సైట్‌కి (https://fastag.ihmcl.com) వెళ్లండి. అక్కడ మీ మొబైల్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ లేదా ఓటీపీ ఎంటర్‌ చేసి లాగిన్‌ అవ్వండి. తర్వాత డ్యాష్‌బోర్డులోకి వెళ్లి ‘మై ప్రొఫైల్‌’ ఆప్షన్‌ను ఎంచుకోండి. అక్కడ మీ కేవైసీ స్టేటస్‌ వివరాలు కనిపిస్తాయి. ఒకవేళ కేవైసీ పూర్తి కాకపోయి ఉంటే అక్కడ అడిగిన వివరాలు సమర్పించి ప్రాసెస్‌ చేయాల్సి ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని