Jio Offer: జియో ఆఫర్‌.. ఈ రెండు ప్లాన్లపై అదనపు డేటా..

Jio free data: ప్రస్తుతం అందిస్తున్న రెండు ప్రీ పెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్లపై అదనపు డేటా అందిస్తున్నట్లు రిలయన్స్‌ జియో ప్రకటించింది.

Published : 11 Jan 2024 15:14 IST

Jio Offer | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం కంపెనీ రిలయన్స్ జియో (Reliance Jio) ఇటీవల అదనపు డేటా ఆఫర్లను తీసుకొచ్చింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు ప్రీపెయిడ్‌ ప్లాన్ల(Jio Prepaid Plan)కు ఈ ఆఫర్‌ వర్తిస్తుంది.

  • జియో అందిస్తున్న రూ.399  ప్రీపెయిడ్‌ ప్లాన్‌ రీఛార్జితో 28 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్‌కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. రోజుకు 3 జీబీ చొప్పున మొత్తం 84 జీబీ డేటా వస్తుంది. ఈ ప్లాన్‌ను ఎంచుకునేవారికి తాజా ఆఫర్‌లో భాగంగా అదనంగా 6జీబీ డేటా పొందొచ్చు.  
  • జియో మరో ప్లాన్‌ రూ.219 రీఛార్జితో 14 రోజుల వ్యాలిడిటీతో అపరిమిత వాయిస్‌కాల్స్‌, 100 ఎస్సెమ్మెస్‌లతో పాటు రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. తాజా ఆఫర్‌లో భాగంగా ఈ ప్లాన్‌తో 2జీబీ డేటా అదనంగా పొందొచ్చు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని