Mutual Funds: మిడ్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులు ఎంతెంత?

3, 5, 10 సంవత్సరాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన మిడ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఇక్కడ ఉన్నాయి.

Published : 13 Jun 2024 12:54 IST

స్టాక్స్‌లో ప్రత్యక్షంగా పెట్టుబడితే నష్టభయం ఉండొచ్చు. అందుచేత చాలా మంది ఇన్వెస్టర్లు మ్యూచువల్‌ ఫండ్ల ద్వారా పరోక్షంగా మార్కెట్లలోకి ప్రవేశిస్తూ ఉంటారు. ఈ మ్యూచువల్‌ ఫండ్లలో వివిధ రకాల కేటగిరీలు ఉన్నాయి, అందులో మిడ్‌ క్యాప్‌ ఫండ్లు కీలకమైనవి. మిడ్‌ క్యాప్‌ ఫండ్లు ప్రధానంగా రూ.5,000 కోట్ల నుంచి రూ.20,000 కోట్ల మధ్య మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీల ఈక్విటీ షేర్లలో పెట్టుబడి పెడతాయి. లార్జ్‌ క్యాప్‌ ఫండ్స్‌ కంటే మిడ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లు ఎక్కువ రాబడిని అందించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మిడ్‌ క్యాప్‌ ఫండ్‌ను ఎంచుకున్నప్పుడు ఫండ్‌కు సంబంధించిన మునుపటి పనితీరును విశ్లేషించడం చాలా కీలకం.

3, 5, 10 సంవత్సరాలలో 17% కంటే ఎక్కువ రాబడిని అందించే ఫండ్ల జాబితాను కింది పట్టికలో తెలిపాం. 2024, జూన్‌ 12 వరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన మిడ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఇక్కడ చూడండి.

గమనిక: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్తులోనూ వస్తాయని హామి లేదు. ఇందులో పెట్టుబడులు పెట్టేముందు SEBI రిజిష్టర్డ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు