Health Insurance: బృంద బీమాలో తల్లిదండ్రులను చేర్చడం మంచిదేనా?
సంస్థ ఆఫర్ చేసే గ్రూప్ కవర్ పాలసీలో తల్లిదండ్రులను చేర్చడం వల్ల లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఇంటర్నెట్ డెస్క్: చాలా ప్రైవేట్ సంస్థలు ఉద్యోగి హోదాను బట్టి ఉచితంగానే బృంద బీమా (గ్రూప్ మెడికల్ కవరేజీ) సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. అయితే, ఉద్యోగులే కాకుండా వారి జీవిత భాగస్వామి, పిల్లలు, తల్లిదండ్రులకు కూడా ఈ బీమా పొందొచ్చు. అయితే, ఉద్యోగి తల్లిదండ్రులకు కంపెనీ అందించే ఈ బీమా కవర్ వల్ల ఉపయోగాలు ఏంటి? ఏవైనా ఇబ్బందులున్నాయా? ఆ కవరేజీ సరిపోతుందా?
ప్రీమియం
బృంద బీమాలో ఉద్యోగి, జీవిత భాగస్వామి, పిల్లలు, ఇంకా ఉద్యోగిపై ఆధారపడిన తల్లిదండ్రులు కూడా బీమా కవరేజీలో ఉంటారు. ఇటువంటి పాలసీలు ఉద్యోగులు, వారి కుటుంబానికి తగిన ఆరోగ్య ధీమాను అందిస్తున్నప్పటికీ.. గ్రూప్ బీమా పరిధిలో తల్లిదండ్రులను చేర్చుకున్నప్పుడు వారి వయసు ఆధారంగా చాలా సంస్థలు అధిక బీమా ప్రీమియం వసూలు చేస్తాయి.
బీమా కవరేజీ సరిపోతుందా?
యజమాని అందించే బీమా కింద తల్లిదండ్రులను కవర్ చేయడం వల్ల అదనపు బీమా ప్రయోజనం కలుగుతుంది. అయితే, సీనియర్ సిటిజన్లకు సాధారణంగానే వైద్య ఖర్చులు ఎక్కువ ఉంటాయి. వారు వయసు రీత్యా తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. అలాగే, వ్యాధుల తీవ్రత వారిలో ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బృంద బీమాలో ఉండే బీమా కవరేజీ సరిపోకపోవచ్చు.
ఇబ్బందులు
వృద్ధులు అనారోగ్యాలకు గురయ్యే అవకాశం ఎక్కువ ఉన్నందున, పాలసీ సంవత్సరంలో అనేక క్లెయిమ్‌లు వారి గురించే చేయల్సి ఉండొచ్చు. అటువంటి సందర్భంలో మిగతా కుటుంబసభ్యులకు తక్కువ బీమా హామీ మిగులుతుంది. కాబట్టి, యజమాని ఆఫర్ చేస్తున్నదానితో పాటు తల్లిదండ్రుల కోసం ప్రత్యేక పాలసీని కొనుగోలు చేయడం మంచిది. అంతేకాకుండా, ఉద్యోగి తన సంస్థను మారాలనుకున్నా లేదా విశ్రాంతి తీసుకున్నా, సంస్థను విడిచిపెట్టిన వెంటనే యజమాని అందించే ప్లాన్ ముగుస్తుంది. ఉద్యోగికే కాకుండా.. తల్లిదండ్రులకు తప్పనిసరిగా అవసరమయ్యే ఎటువంటి ఆరోగ్య బీమా ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో అనారోగ్యాలు ఏర్పడినప్పుడు, ఆర్థికంగా చాలా ఇబ్బంది పడతారు.
విశ్వసనీయత
ఉద్యోగి, అతడి కుటుంబాన్ని బృంద బీమా పరిధిలోకి తీసుకురావడం సులభం అయినప్పటికీ, దాని కొనసాగింపు సంస్థ యజమానికి సంబంధించిన ప్రాధాన్యతలపై ఆధారపడి ఉంటుంది. కవరేజీ ప్రయోజనాలను యజమాని తగ్గించాలని నిర్ణయించుకున్నా, పాలసీని నిలిపివేయాలని లేదా పాలసీలో తల్లిదండ్రులకు లభించే ప్రయోజనాన్ని తీసివేయాలని నిర్ణయించుకున్నా.. అది మీ వైద్య కవరేజీ మొత్తాన్ని ప్రభావితం చేస్తుంది.
ఉపయోగాలు
గ్రూప్ కవర్ కింద ఉద్యోగి, అతడిపై ఆధారపడినవారు ముందస్తు మెడికల్ చెక్-అప్లు చేయించుకోవాల్సిన అవసరం లేదు. అందువల్ల ఉద్యోగితో పాటు కుటుంబసభ్యులు ఎటువంటి అవాంతరాలు, మెడికల్ రిపోర్టులు అవసరం లేకుండా తక్షణమే ఆరోగ్య బీమా పాలసీని పొందుతారు. రిటైల్ హెల్త్ ఇన్సూరెన్స్‌తో పోలిస్తే.. చాలా గ్రూప్ పాలసీలు జీరో వెయిటింగ్ పీరియడ్‌ను కలిగి ఉంటాయి. పాలసీ ప్రారంభం నుంచి ఉద్యోగికి, అతడిపై ఆధారపడిన కుటుంబసభ్యులకు తక్షణ కవరేజీని అందిస్తాయి. ఇది చాలా సానుకూలాంశం. ఉదా: తల్లిదండ్రులకు ఉబ్బసం, మధుమేహం లేదా ఏదైనా తీవ్రమైన వైద్య పరిస్థితులు ఉంటే.. వారు చికిత్స పొంది, బృంద బీమా కింద క్లెయిమ్ చేయవచ్చు. ఎందుకంటే, ఇది మొదటి రోజు నుంచి చికిత్సలను కవర్ చేస్తుంది.
చివరిగా: బృంద బీమా కవర్ ఉన్నప్పటికీ సమగ్ర కవరేజీ కోసం అదనంగా సొంతంగా ఆరోగ్య బీమా పాలసీ ఉండడం మంచిది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆరోగ్య బీమా.. ఏ వయసులోనైతే మేలు..?
ఒక వ్యక్తి యుక్త వయసులోనే ఆరోగ్య బీమా పాలసీ తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గింపు సహా అనేక ప్రయోజనాలుంటాయి. అవేంటో తెలుసుకోండి.. -
ఆరోగ్య బీమా అందరికీ అందేలా...
అందరికీ బీమా పాలసీలను అందించాలనే లక్ష్యంతో ఉన్న భారతీయ బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్డీఏఐ) ఆరోగ్య బీమా పాలసీ నిబంధనల్లో కీలక మార్పులు తీసుకొచ్చింది. -
మ్యూచువల్ ఫండ్లు..కేవైసీని పూర్తి చేశారా?
ఆర్థిక లక్ష్యాలను సాధించే క్రమంలో పెట్టుబడులు ఎంతో కీలకం. దీర్ఘకాలంలో సంపదను సృష్టించేందుకూ ఇవి అవసరం. చాలామంది మ్యూచువల్ ఫండ్లను ఇందుకు సరైన మార్గంగా నమ్ముతున్నారు. -
పన్ను విధానం ఎంచుకుందామిలా...
ITR: గత ఆర్థిక సంవత్సరంలో ఆర్జించిన ఆదాయానికి పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు తరుణం వచ్చేసింది. ఈ నేపథ్యంలో పన్ను చెల్లింపుదారులు కొత్త, పాత పన్ను విధానంలో దేన్ని ఎంచుకోవాలన్న సందేహంలో ఉన్నారు. -
క్రెడిట్ స్కోరు పెరగాలంటే
బ్యాంకులు, ఆర్థిక సంస్థలు ఒక వ్యక్తికి రుణాన్ని ఇచ్చేటప్పుడు ముఖ్యంగా పరిశీలించేది క్రెడిట్ స్కోరు. రుణగ్రహీత చరిత్ర, అతని అర్హతను తెలుసుకునేందుకూ ఇది ఉపయోగపడుతుంది. -
Mutual Funds: స్మాల్ క్యాప్ ఫండ్లపై రాబడులివే
స్మాల్ క్యాప్ ఫండ్లలో రిస్క్ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు. -
సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు ప్రయోజనమేనా?
నాన్ లగ్జరీ కారు కొనుగోలు కంటే కొద్దిగా ఎక్కువ ఖర్చు చేస్తే అధునాతన ఫీచర్లు గల సెకండ్ హ్యాండ్ లగ్జరీ కారు కొనుగోలు చేయొచ్చు. ఇలాంటి కార్ల కొనుగోలుతో ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా అనేది చూద్దాం. -
జీవిత బీమాలో క్లెయిం సెటిల్మెంట్ ఎలా?
జీవిత బీమా క్లెయిమ్స్ సెటిల్మెంట్ అనేది బీమా సంస్థకు సంబంధించిన ముఖ్యమైన సేవల్లో కీలకమైనది. క్లెయిం సెటిల్మెంట్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. -
ఆరోగ్య బీమా కొనుగోలుకు వయో పరిమితి తొలగింపు
ఆరోగ్య బీమా కొనుగోలుకు ఉన్న వయో పరిమితిని ఐఆర్డీఏ తొలగించింది. దీంతో అన్ని వయసుల వారూ బీమా పాలసీని తీసుకునే అవకాశం లభించనుంది. -
ఆదాయపు పన్ను రిటర్నులు ఎప్పుడంటే...
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసేందుకు వీలుగా సంబంధిత ఐటీఆర్‌లను ఐటీ శాఖ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటికే పన్ను చెల్లింపుదారులకు 2023-24 ఆర్థిక సంవత్సరంలో (2024-25 మదింపు సంవత్సరం) మూలం వద్ద పన్ను కోత (టీడీఎస్)కు సంబంధించిన వివరాలను సంక్షిప్త సందేశాల రూపంలో పంపిస్తూ ఉంది -
ఆరోగ్య బీమా ప్రీమియం భారం కాకుండా
ఆర్థిక ప్రణాళికలో ఆరోగ్య బీమా పాలసీ ఎంతో కీలకంగా మారింది. ఊహించని వైద్య ఖర్చులను తట్టుకునేందుకు పూర్తి స్థాయి ఆరోగ్య బీమా పాలసీ అనివార్యం అవుతోంది. -
ఉన్నత చదువులకు భరోసానిద్దాం...
పిల్లల చదువుల ఖర్చులు ఏటా 7-10 శాతం పెరుగుతున్నాయి. మరోవైపు క్షీణిస్తున్న రూపాయి విలువ దీనికి అదనం. ఒకప్పటితో పోలిస్తే పిల్లల ఉన్నత చదువుల ప్రణాళిక ఇప్పుడు క్లిష్టంగా మారింది. -
వెండిలో పెట్టుబడి లాభమేనా?
బంగారం, వెండి.. ఈ రెండు లోహాలతో భారతీయులకు విడదీయలేని సంబంధం ఉంది. ఆభరణాలు, వస్తువుల రూపంలో వీటిని కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి చూపిస్తారు -
సరైన బీమా హామీ మొత్తాన్ని ఎలా ఎంచుకోవాలి?
ప్రస్తుత కాలంలో సంపాదించే ప్రతి వ్యక్తికి, ముఖ్యంగా తనపై ఆధారపడిన వారు ఉన్నప్పుడు తగిన జీవిత బీమా మొత్తం ఉండడం ఎంతో అవసరం. ఎంత బీమా ఉంటే కుటుంబ సభ్యులకు సరిపోవచ్చో ఇక్కడ చూడండి. -
ఆరోగ్య బీమా రూల్స్‌లో మార్పులు.. పాలసీదారులకు ప్రయోజనం
IRDAI : ఆరోగ్య బీమా పాలసీల నిబంధనల విషయంలో బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది. వీటి ద్వారా బీమా కస్టమర్లకు మరింత ప్రయోజనం చేకూరనుంది. -
మిడ్ క్యాప్ ఫండ్లపై రాబడులు ఎంతెంత?
దేశీయంగా పెట్టుబడులకు వివిధ మ్యూచువల్ ఫండ్ల పథకాలు ఉన్నాయి. ఈ మ్యూచువల్ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్ని మిడ్ క్యాప్ ఫండ్లను ఇక్కడ చూడొచ్చు. -
కొత్త ఏడాదిలో పన్ను విధానం ఎంచుకుంటున్నారా? ఇవి తెలుసుకున్నాకే..!
Income tax: కొత్త ఆర్థిక సంవత్సరంలో వేతన జీవులు పన్ను విధానం యాజమాన్యానికి తెలియజేయాలి. టీడీఎస్ కోసం మీకు నప్పే పన్ను విధానం ఎంచుకోవడం మంచిది. -
పదవీ విరమణ తర్వాత రూ.1 కోటి నిధి సరిపోతుందా?
చాలా మంది పదవీ విరమణ నిధికి రూ.1 కోటి సరిపోతుందని అనుకుంటారు. ఎలాంటి విషయాలు పదవీ విరమణ నిధిని, రాబడిని ప్రభావితం చేస్తాయి. రూ.1 కోటి నిధి సరిపోతుందా? లేదా? ఇక్కడ తెలుసుకోండి.. -
జీవిత బీమా.. అనుబంధ పాలసీలు తీసుకున్నారా?
ఊహించని పరిస్థితుల నుంచి మీ కుటుంబ ఆర్థిక భవిష్యత్తుకు రక్షణ కల్పించేది జీవిత బీమా. సంపాదించే ప్రతి ఒక్కరూ తన ఆర్థిక ప్రణాళికల్లో దీనికి తగిన స్థానం ఇవ్వాల్సిందే. ఆయుర్దాయం పెరుగుతోంది. అదే సమయంలో జీవన శైలీ మారుతోంది. -
లక్ష్య సాధనకు సిప్ మార్గం
స్టాక్ మార్కెట్లో చిన్న మొత్తాలతోనూ మదుపు చేసేందుకు క్రమానుగత పెట్టుబడి విధానం (సిప్) తోడ్పడుతుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు సిప్ ద్వారా మదుపు చేసే వారు పెరిగారు. యాంఫీ గణాంకాల ప్రకారం చూస్తే.. గత నెలలో దాదాపు 42.87 లక్షల కొత్త సిప్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. -
విహార యాత్రలో ధీమాగా
వేసవి సెలవులు వచ్చేశాయి. ఈ కాలంలో చల్లని ప్రాంతాలకు వెళ్లేందుకు చాలామంది ఆసక్తి చూపిస్తుంటారు. ఇందులో చాలామంది విదేశాలకు వెళ్లేవారూ ఉంటారు. ఈ నేపథ్యంలో విదేశీ ప్రయాణాల్లో అనుకోని అవాంతరాలు, అనారోగ్యం వచ్చినప్పుడు తోడుండేలా బీమా తీసుకోవడం మంచిది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/04/24)
-
విరాట్ - హార్దిక్‌కు నో ఛాన్స్.. ఈ లఖ్‌నవూ స్టార్‌కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్‌డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్‌కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్‌కు సుహాస్‌ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్