RBI: ఆర్‌బీఐ పోర్టల్‌ నుంచి ఫ్లోటింగ్‌ రేటింగ్‌ బాండ్స్‌ కొనుగోలు

Floating Rate Savings Bonds: ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్స్‌ కొనుగోలు చేయాలనుకునే రిటైల్‌ ఇన్వెస్టర్లకు ఆర్‌బీఐ గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఆర్‌బీఐ పోర్టల్‌ నుంచే కొనుగోలుకు అవకాశం కల్పించింది.

Updated : 24 Oct 2023 04:26 IST

ముంబయి: రిటైల్‌ ఇన్వెస్టర్లకు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (RBI) గుడ్‌న్యూస్‌ చెప్పింది. ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్స్‌, 2020ను (Floating Rate Savings Bonds) ఇకపై ఆర్‌బీఐకి చెందిన రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌ (Retail Direct portal) నుంచి కొనుగోలు చేయొచ్చని తెలిపింది. ఆర్‌బీఐ రిటైల్‌ డైరెక్టర్‌ స్కీమ్‌ను 2021 నవంబర్‌ 12న ప్రధాని మోదీ ప్రారంభించారు. 

ఈ స్కీమ్‌ కింద రిటైల్‌ ఇన్వెస్టర్లు ఆర్‌బీఐ డైరెక్ట్‌ పోర్టల్‌లో అకౌంట్‌ను తెరవాల్సి ఉంటుంది. ఆపై ప్రైమరీ, సెకండరీ మార్కెట్‌ ప్రభుత్వ సెక్యూరిటీల్లో మదుపు చేయొచ్చు. రిటైల్‌ ఇన్వెసర్టకు పెట్టుబడి అవకాశాలను సులభతరం చేయడంలో భాగంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. ప్రస్తుతం రిటైల్‌ ఇన్వెస్టర్లు కేంద్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, ట్రెజరీ బిల్లులు, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలు, సావరిన్‌ గోల్డ్‌ బాండ్స్‌ను రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌ ద్వారా కొనుగోలు చేసే వీలుంది. తాజాగా ఫ్లోటింగ్‌ బాండ్లను చేర్చారు.

FD కంటే ఎక్కువ వడ్డీ.. పైగా RBI హామీ.. ఈ బాండ్ల గురించి తెలుసా?

రిటైల్‌ డైరెక్ట్‌ పోర్టల్‌లో అందించే ఉత్పత్తుల మరింత విస్తరించే ఉద్దేశంతో ప్రభుత్వంతో చర్చల అనంతరం ఫ్లోటింగ్‌ రేట్‌ సేవింగ్స్‌ బాండ్స్ సబ్‌స్క్రిప్షన్‌ను కూడా ఆర్‌బీఐ ప్రారంభించింది. ఏడేళ్ల కాలపరిమితితో వచ్చే ఈ బాండ్ల వడ్డీ రేట్లు ఎప్పుడూ స్థిరంగా ఉండదు. నేషనల్‌ సేవింగ్స్‌ స్కీమ్‌తో ఈ వడ్డీ రేట్లు ముడిపడి ఉంటాయి. ఎన్‌ఎస్‌సీ అందించే వడ్డీ రేటుకు 0.35 శాతం ఎక్కువ రేటు ఈ బాండ్లపై లభిస్తుంది. ఎఫ్‌డీకి ప్రత్యామ్నాయంగా ఏడేళ్ల పాటు డబ్బుతో అవసరం లేదనుకున్న వారు ఇందులో పెట్టుబడి పెట్టొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు