Mutual Funds: వివిధ లార్జ్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులు ఇలా ఉన్నాయి

3, 5, 10 సంవత్సరాల్లో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఇక్కడ ఉన్నాయి.

Published : 08 Apr 2024 14:14 IST

ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్‌ మార్కెట్‌ ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నప్పటికీ, దీనిపై సరైన అవగాహన లేనివారు ప్రత్యక్షంగా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం సరైంది కాదు. పెట్టుబడికి సంబంధించిన ప్రాధమిక అంశాలను తెలుసుకోవడం ఎంతో అవసరం. అందుచేత చాలా మంది ప్రత్యక్షంగా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం కన్నా మధ్యేమార్గంగా మ్యూచువల్‌ ఫండ్లను ఆశ్రయిస్తుంటారు. మార్కెట్‌ నిపుణులు కూడా మొదటగా పెట్టుబడి పెట్టేవారికి మ్యూచువల్‌ ఫండ్లను సిఫార్సు చేస్తారు. మ్యూచువల్‌ ఫండ్లను నిపుణులైన ఫండ్‌ మేనేజర్లు నిర్వహిస్తారు. ముఖ్యంగా, మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులను కొత్తగా ప్రారంభించేవారు లార్జ్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. లార్జ్‌-క్యాప్‌ ఫండ్లు అనేవి పెద్ద మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీల షేర్లలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడి పెడుతుంటాయి. ఇతర ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లతో పోల్చినప్పుడు తక్కువ రిస్క్‌ కలిగి ఉంటాయి.

3, 5, 10 సంవత్సరాలలో ఎక్కువ రాబడిని అందించిన ఫండ్ల జాబితాను కింది పట్టికలో తెలిపాం. 2024, ఏప్రిల్‌ 5 వరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఇక్కడ చూడండి.

గమనిక: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్తులోనూ వస్తాయని హామీ లేదు. కాబట్టి ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు సెబీ రిజిస్టర్డ్ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని