Mutual Funds: వివిధ లార్జ్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులు ఇలా..

3, 5, 10 సంవత్సరాలలో అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలు ఇక్కడ ఉన్నాయి.

Published : 05 Dec 2023 17:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రస్తుత పరిస్థితుల్లో స్టాక్‌ మార్కెట్‌ ఎక్కువ మందిని ఆకర్షిస్తున్నప్పటికీ.. దీనిపై సరైన అవగాహన లేనివారు ప్రత్యక్షంగా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది కాదు. పెట్టుబడికి సంబంధించిన ప్రాధమిక అంశాలను తెలుసుకోవడమే కాకుండా మార్కెట్‌పై సరైన అవగాహన కూడా ఎంతో అవసరం. అందుచేత చాలా మంది ప్రత్యక్షంగా స్టాక్స్‌లో పెట్టుబడి పెట్టడం కన్నా మధ్యేమార్గంగా మ్యూచువల్‌ ఫండ్లను ఆశ్రయిస్తుంటారు. మార్కెట్‌ నిపుణులు కూడా మొదటగా పెట్టుబడి పెట్టేవారికి మ్యూచువల్‌ ఫండ్లను సిఫార్సు చేస్తారు.

మ్యూచువల్‌ ఫండ్లను నిపుణులైన ఫండ్‌ మేనేజర్లు నిర్వహిస్తారు. ముఖ్యంగా మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులను కొత్తగా ప్రారంభించేవారు ఈ లార్జ్‌క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. లార్జ్‌-క్యాప్‌ ఫండ్లు అనేవి పెద్ద మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీల ఈక్విటీ షేర్లలో ఎక్కువ భాగాన్ని పెట్టుబడి పెట్టే ఈక్విటీ ఫండ్ల రకం. ఇతర ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్లతో పోల్చినప్పుడు తక్కువ రిస్క్‌ పోర్ట్‌ఫోలియోను ఈ లార్జ్‌క్యాప్‌ ఫండ్లు కలిగి ఉంటాయి. సిప్‌, లంప్సమ్‌ (ఒకేసారి పెట్టుబడి) రెండు మార్గాలలో దేనిలోనైనా లార్జ్‌క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టొచ్చు. 3, 5, 10 సంవత్సరాల్లో 11% కంటే ఎక్కువ రాబడిని అందించే ఫండ్ల జాబితాను కింది పట్టికలో తెలిపాం. 2023 డిసెంబర్‌ 4 వరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన లార్జ్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఇక్కడ చూడండి..

గమనిక: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్‌లోనూ వస్తాయని హామీ లేదు. కాబట్టి ఏదైనా మ్యూచువల్‌ ఫండ్‌ పథకంలో పెట్టుబడి పెట్టే ముందు సెబీ రిజిష్టర్డ్‌ ఫైనాన్షియల్‌ అడ్వైజర్‌ను సంప్రదించడం చాలా ముఖ్యం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని