ITR filing: ఐటీఆర్ ఫైలింగ్‌లో తప్పులా? ఇప్పుడేం చేయాలి?
Revised itr process in telugu: ఒకవేళ ఇప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే అపరాధ రుసుము చెల్లించి డిసెంబరు 31లోపు ఆలస్యపు ఐటీఆర్ దాఖలు చేయవచ్చు.
ఇంటర్నెట్ డెస్క్: గత ఆర్థిక సంవత్సరానికి (2021-22) సంబంధించి ఆడిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఐటీఆర్ దాఖలు (ITR filing) చేసేందుకు వీలున్న ఖాతాల రిటర్నుల దాఖలు గడువు జులై 31తో ముగిసింది. ఒకవేళ ఇప్పటికీ ఐటీఆర్ ఫైల్ చేయకపోతే అపరాధ రుసుము చెల్లించి ఈ ఏడాది డిసెంబరు 31లోపు ఆలస్యపు ఐటీఆర్ (Belated ITR) దాఖలు చేయవచ్చు. గడువులోపు రిటర్నులు దాఖలు చేసిన అర్హులైన వ్యక్తులకు రీఫండ్ కూడా లభిస్తుంది. ఒకవేళ రీఫండ్ రాకపోతే ఐటీఆర్ దాఖలులో ఏమైనా తప్పులు ఉన్నాయా? అనేది చెక్ చేసుకోవడం మంచిది.
ఐటీ రిటర్నులు దాఖలు చేసేటప్పుడు కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయి. ఇలాంటి తప్పులు/పొరపాట్లు జరిగితే రీఫండ్ రాదు. అందువల్ల ఈ తప్పులను సరిచేసుకోవాల్సి ఉంటుంది. రివైజ్డ్ (సవరించిన) ఐటీఆర్‌ను (Revised ITR) సమర్పించడం ద్వారా పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్ దాఖలులో చేసిన తప్పులను సరిదిద్దుకోవచ్చు. ఆదాయపు పన్ను చట్టం 1961, సెక్షన్ 139 (5) కింద పన్ను చెల్లింపుదారులు రివైజ్డ్ ఐటీఆర్ దాఖలు చేసే వెసులుబాటు ఉంది. మదింపు సంవత్సరం ముగియడానికి మూడు నెలల ముందు వరకు రివైజ్డ్ ఐటీఆర్‌ను దాఖలు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే ఇప్పటికే సమర్పించిన ఐటీఆర్‌లో తప్పులు ఉన్నట్లు గుర్తిస్తే డిసెంబరు 31లోపు సవరించిన ఐటీఆర్‌ని దాఖలు చేయవచ్చు.
ఐటీఆర్ దాఖలు చేసేటప్పుడు సాధారణంగా చేసే తప్పులు/పొరపాట్లు..
- బ్యాంకు వివరాలను తప్పుగా నమోదు చేయడం
- వ్యక్తిగత వివరాలు తప్పుగా ఇవ్వడం
- తప్పు ఐటీఆర్ ఫారం ఎంచుకోవడం
- ఆదాయం వివరాలు, ఫారం 26ఏఎస్‌తో సరిపోలకపోవడం
- టీడీఎస్ క్లెయిమ్ చేయని క్రెడిట్
- ఆస్తులు, అప్పులు జతచేయడంలో చేసే తప్పులు
- విదేశీ ఆదాయం, ఆస్తులు వెల్లడించడంలో చేసే పొరపాట్లు
- నివాసం, ఇతర సమాచారం తప్పుగా ఎంటర్ చేయడం
రివైజ్డ్ రిటర్నులను ఆన్లైన్లో దాఖలు చేసే విధానం..
- ముందుగా https://www.incometax.gov.in/iec/foportalకి వెళ్లి మీ యూజర్ ఐడీ, పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలి.
- మీ ఖాతాకు లాగిన అయిన తర్వాత ఇటీవలే ఫైల్ చేసిన ఐటీఆర్‌కు సంబంధించిన ఫైల్ రివైజ్డ్ రిటర్న్ ఆప్షన్ చూడవచ్చు.
- ఇక్కడ ఏవై 2022-23 ఎంచుకుని, ఫైలింగ్ మోడ్ ఆన్లైన్ ఎంచుకుని (ఇక్కడ ఆఫ్‌లైన్ మోడ్ కూడా ఎంచుకోవచ్చు) కంటిన్యూపై క్లిక్ చేయాలి.
- ఆ తర్వాత మీ స్టేటస్ (ఇండివిడ్యువల్, హెచ్‌యూఎఫ్, ఇతరులు)ని సెలక్ట్ చేసుకోవాలి.
- ఇక్కడ మీకు వర్తించే ఐటీఆర్ ఫారాన్ని ఎంచుకోవాలి. ఒరిజినల్‌గా సబ్మిట్ చేసిన ఫారంనే తిరిగి సెలక్ట్ చేసుకోవాలనేం లేదు.
- ఇప్పుడు మీరు రివైజ్డ్ రిటర్నులు ఎందుకు దాఖలు చేస్తున్నారో తగిన కారణం తెలపాలి.
- ఆ తర్వాత తప్పులను సరిచేసి రిటర్నులను ఫైల్ చేయాలి. ఆ తర్వాత ఈ-వెరిఫికేషన్ పూర్తిచేయాలి.
- పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను శాఖ సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్, బెంగుళూరు వారికి ఆఫ్‌లైన్ ద్వారా అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా పంపించి కూడా రిటర్నుల వెరిఫికేషన్ పూర్తి చేయవచ్చు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీలునామా ఎలా రాయాలి?
వీలునామా అనేది ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతడి ఆస్తులు, అప్పుల పంపిణీకి సంబంధించిన డిక్లరేషన్‌తో కూడిన చట్టపరమైన పత్రం. -
ఆదాయపు పన్ను ఫారం-16 లేకున్నా రిటర్నులు
గత ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేయడానికి (అసెస్మెంట్ ఇయర్ 2024-25) జులై 31తో గడువు ముగియనుంది. ఇప్పటికీ రిటర్నులు దాఖలు చేయని వారు సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలి. -
సరైన పాలసీ ఎంపిక ఇలా
ఆరోగ్య సంరక్షణ ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఊహించని వైద్య ఖర్చుల నుంచి మీ కష్టార్జితాన్ని కాపాడుకోవాలంటే ఆరోగ్య బీమా పాలసీని తీసుకోవడం తప్పనిసరి అవసరంగా మారింది. మీ నిర్దిష్ట అవసరాలను తీర్చగల మంచి పాలసీని ఎంచుకున్నప్పుడే అది కష్టకాలంలో అండగా ఉంటుంది. ఇలాంటి పాలసీని ఎలా గుర్తుపట్టాలి.. చూద్దాం. -
ఇంటి రుణం పదేళ్లలో తీర్చేద్దాం..
సొంతిల్లు కోసం రుణం తీసుకొని, దాదాపు 25 ఏళ్లపాటు చెల్లిస్తూనే ఉండాలి. దీనివల్ల వడ్డీ భారం పెరుగుతుంది. ఇతర ఆర్థిక లక్ష్యాలు నెరవేర్చుకునేందుకు ఇబ్బందులు ఏర్పడతాయి. -
ఐటీఆర్‌లో తప్పులా..? ఇలా చేస్తే రివైజ్డ్ ఐటీఆర్ అవసరం లేదు!
ITR Filing: ఐటీఆర్‌లో తప్పులు దొర్లాయా? దానికి చింతించాల్సిన అవసరం లేదు. దానికి ఆదాయపు పన్ను శాఖ ఓ అవకాశం కల్పిస్తోంది. -
మీ జీవిత బీమాను సరెండర్ చేస్తున్నారా? ఇవి తెలుసుకోండి..
జీవిత బీమా పాలసీదారుడు ప్రీమియంలు చెల్లించలేక, పాలసీని నిర్దిష్ట కాలవ్యవధి లోపు పునరుద్ధరించుకోలేకపోతే ఆ పాలసీని సరెండర్ చేయొచ్చు. పాలసీని సరెండర్ చేయడం వల్ల వచ్చే పరిణామాలను ఇక్కడ తెలుసుకుందాం. -
విదేశాల్లో విద్యనభ్యసించే ముందు ఎలాంటి ఖర్చులుంటాయి?
విదేశాల్లో చదువుకోవడానికి వెళ్లే ముందు అనేక ప్రక్రియలు ఉంటాయి. అవేంటో, వాటికయ్యే ఖర్చులేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
ఐటీఆర్‌ను ఇలా ఈ-వెరిఫై చేయండి.. లేదంటే..
ITR Filing: ఆదాయపు రిటర్నులు దాఖలు చేసిన తర్వాత దాన్ని వెరిఫై చేయాల్సి ఉంటుంది. దానికి 30 రోజుల గడువు ఉంటుంది. -
అధికంగా ఖర్చు చేయకుండా రివార్డ్ పాయింట్లు ఎలా పెంచుకోవాలి?
క్రెడిట్ కార్డు ద్వారా అధికంగా ఖర్చు పెట్టకుండా కార్డును ఉపయోగించి కూడా రివార్డు పాయింట్లను పొందొచ్చు. -
కొత్త పన్ను విధానం ఎవరికి మేలంటే..?
గత ఆర్థిక సంవత్సరం నుంచి పన్ను రిటర్నుల దాఖలు సమయంలో కొత్త పన్ను విధానం ‘డిఫాల్ట్’గా మారింది. -
ఇల్లు కొంటున్నారా?
జీవితంలో అతి పెద్ద పెట్టుబడి ఇల్లు. దీన్ని సొంతం చేసుకోవాలని అందరూ అనుకుంటారు. ఒకవైపు అధికంగా ఉన్న స్థిరాస్తి ధరలు.. మరోవైపు రుణాలపై వడ్డీ రేటు గరిష్ఠ స్థాయిలో కొనసాగుతుండటం.. -
రేపటి కోసం పాటించండి ఈ ఆర్థిక చిట్కాలు
ఒక విషయంపై పూర్తి సమాచారం తెలుసుకోవడం ఇప్పుడు పెద్ద కష్టమేమీ కాదు. అరచేతిలోనే సమస్త విశ్వ సమాచారం దొరుకుతోంది. ఆర్థిక అంశాలపై అవగాహన పెంచుకోవడం ఎంతో అవసరం. -
ఎస్టేట్ ప్లానింగ్‌లో వారసత్వ ప్రణాళిక
ఎస్టేట్ ప్లానింగ్ అనేది కుటుంబాలకు తగిన వారసత్వ ప్రణాళికలను, భవిష్యత్తులో వారు చేయబోయే అనేక కార్యకలాపాలకు మార్గదర్శకం వహిస్తుంది. -
ఐటీఆర్ ఫైలింగ్.. ఈ తప్పులు చేయొద్దు..!
ITR filing: ఆడిట్ అవసరం లేని వ్యక్తులు జులై 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయాల్సి ఉంటుంది. లేదంటే జరిమానా చెల్లించాల్సి వస్తుంది. అలా అని తొందరపడి ఎలాంటి పొరపాట్లు చేయొద్దు. సాధారణంగా ఐటీఆర్ ఫైలింగ్ సమయంలో చేసే తప్పులేంటో చూద్దాం.. -
ఆరోగ్య బీమా క్లెయిం తిరస్కరణకు గురైందా? కారణాలు ఇవే..!
ఆరోగ్య బీమా పాలసీదారుడికి అత్యవసర సమయాల్లో ఆర్థిక ఉపశమనాన్ని అందిస్తుంది. కొన్ని కారణాల వల్ల పాలసీదారుడి క్లెయిం తిరస్కరణకూ గురవుతుంది. అందుకు గల కారణాలేంటో ఇక్కడ తెలుసుకుందాం. -
తీవ్ర వ్యాధులు ఆర్థికంగా ఇబ్బంది పెట్టకుండా
క్యాన్సర్.. గుండెపోటు.. పక్షవాతం.. కాలేయ సంబంధిత వ్యాధులు.. ఇటీవలి కాలంలో ఇలాంటి జీవన శైలి వ్యాధుల జాబితా పెరిగిపోతూనే ఉంది. -
షేర్లలో మదుపు అవగాహనతో వేయాలి అడుగులు
స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. పెట్టుబడులు పెట్టిన వారందరికీ లాభాలు కనిపిస్తున్నాయి. దీంతో కొత్తగా మార్కెట్లో మదుపు చేయాలనుకుంటున్న వారి సంఖ్య పెరుగుతోంది. -
ఆదాయపు పన్ను పత్రాలు సరిచూసుకోండి
ఆదాయపు పన్ను రిటర్నులు సమర్పించేందుకు గడువు సమీపిస్తోంది. ఇప్పటికే చాలామంది ఈ ప్రక్రియను పూర్తి చేశారు. -
కొత్త పథకం
‘ఎడెల్వైజ్ బిజినెస్ సైకిల్ ఫండ్’ అనే కొత్త పథకాన్ని ఎడెల్వైజ్ మ్యూచువల్ ఫండ్ తీసుకొచ్చింది. ఇది కొంత భిన్నమైన పథకం. ‘ఫ్యాక్టర్ ఆధారిత పెట్టుబడి’ విధానాన్ని ఈ పథకం అనుసరిస్తుంది. -
కొత్తగా ఉద్యోగంలో చేరారా?.. ఇవి తెలుసుకోవాల్సిందే..!
కొత్తగా ఉద్యోగ జీవితంలో ప్రవేశించినవారికి ఆర్థిక ప్రణాళికకు సంబంధించి అనేక వ్యవహారాల్లో తగినంత అవగాహన ఉండదు. వారు ఆర్థికంగా మెరుగైన స్థితిలో ఉండడానికి ఏం చేయాలి? ఏం చేయకూడదు? -
అత్యవసర నిధిని ఎలా సమకూర్చుకోవాలి?
అత్యవసర నిధిని నిర్మించడం అనేది చక్కటి ఆర్థిక ప్రణాళికకు సంబంధించిన ముఖ్యమైన నిర్ణయం.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
ద్రవిడ్ సర్ప్రైజ్ వాయిస్ మెసేజ్.. భావోద్వేగానికి గురైన గంభీర్
-
జగన్.. మీకు ఎందుకు సంఘీభావం ప్రకటించాలి?: షర్మిల
-
గత ఐదేళ్లలో విదేశాల్లో 633 మంది భారత విద్యార్థులు మృతి
-
కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు రూపాయి తీసుకురాలేదు: మంత్రి పొన్నం
-
‘యానిమల్ పార్క్’.. ఆ విషయం నేను చెప్పలేను: త్రిప్తి దిమ్రీ
-
పారిస్ ఒలింపిక్స్‌లో హిందీకి అరుదైన గౌరవం