Mutual Funds: Mutual Funds: స్మాల్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడులివే

స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో రిస్క్‌ ఉన్నప్పటికీ, దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని అందించగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ఈ ఫండ్లలో మంచి ఫలితాలను అందించిన కొన్నింటిని ఇక్కడ చూడొచ్చు.

Published : 20 Jun 2024 14:44 IST

ఎఫ్‌డీలపై, వివిధ సాంప్రదాయ పథకాలపై వచ్చే రాబడిని తక్కువ అనుకునేవారు, రిస్క్‌కు సిద్ధపడేవారు, ఈక్విటీ మార్కెట్‌ పెట్టుబడుల వైపు చూస్తున్నారు. కొన్ని సంవత్సరాల నుంచి ఈక్విటీ మార్కెట్‌ల ఫలితాలు మెరుగ్గా ఉండడంతో ఆ వైపు పెట్టుబడులు బాగానే పెరుగుతున్నాయి. ఈక్విటీ మార్కెట్ల పెట్టుబడులపై రిస్క్‌ ఉన్నప్పటికీ, స్మాల్‌ క్యాప్‌ ఫండ్లపై రాబడి ఆశాజనకంగానే ఉండడంతో ఇన్వెస్టర్లు కొన్ని ఏళ్ల నుంచి అధిక రాబడిని ఆర్జించారు. ఈ మ్యూచువల్‌ ఫండ్లు స్మాల్‌ క్యాప్‌ కేటగిరీ నుంచి పెట్టుబడి కోసం షేర్లను ఎంచుకుంటాయి. ఇందులో అతిపెద్ద 250 షేర్లను(మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌) మినహా అన్ని షేర్లు ఉంటాయి. ఇవి ప్రధానంగా రూ.5,000 కోట్ల కంటే తక్కువ మార్కెట్‌ క్యాపిటలైజేషన్‌ ఉన్న కంపెనీల షేర్లలో పెట్టుబడి పెడతాయి. ఇతర రకాల ఈక్విటీ ఫండ్లతో పోలిస్తే స్మాల్‌ క్యాప్‌ ఫండ్‌లు అధిక రిస్క్‌తో ముడిపడి ఉంటాయి.

మార్కెట్‌లో స్వల్ప ఒడిదుడుకులు కూడా స్మాల్‌ క్యాప్‌ కంపెనీల షేర్ల ధరలపై భారీ ప్రభావం చూపుతాయి. అయినప్పటికీ, ఈ ఫండ్లు 8-10 ఏళ్ల దీర్ఘకాలంలో గణనీయమైన రాబడిని పొందగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. లార్జ్‌-క్యాప్‌, మిడ్‌-క్యాప్‌ ఫండ్స్‌ కంటే స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లు ప్రస్తుతం ఎక్కువ రాబడినే ఇస్తున్నాయి. అయితే, ఇందులో పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులు కొన్నిసార్లు నష్టాలకు కూడా సిద్ధంగా ఉండాలి.

3, 5, 10 సంవత్సరాలలో 17% కంటే ఎక్కువ రాబడిని అందించిన ఫండ్ల జాబితా ఇక్కడ ఉంది. 2024, జూన్‌ 19 వరకు అత్యుత్తమ పనితీరు కనబరిచిన స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లను ఇక్కడ చూడండి.

గమనిక: మ్యూచువల్‌ ఫండ్లలో పెట్టుబడులు మార్కెట్‌ రిస్క్‌లకు లోబడి ఉంటాయి. ఇవే ఫలితాలు భవిష్యత్‌లోనూ వస్తాయన్న హామీ లేదు. ఇందులో పెట్టుబడులు పెట్టేముందు SEBI రిజిస్టర్డ్ ఇన్వెస్ట్‌మెంట్‌ అడ్వైజర్‌ను సంప్రదించడం మంచిది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని