JioHotstar: ఈ డేటా ప్లాన్లతో ఫ్రీగా ఐపీఎల్‌.. వివరాలు ఇవీ..

Eenadu icon
By Business News Team Published : 21 Mar 2025 16:15 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

JioHotstar | ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2025 (IPL 2025) సందడి రేపటి (మార్చి 22) నుంచి మొదలు కానుంది. క్రికెట్‌ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ మ్యాచ్‌లను వీక్షించేందుకు జియో హాట్‌స్టార్‌ (JioHotstar) అవకాశం కల్పిస్తోంది. దాదాపు రెండు నెలలకు పైగా ఈ లీగ్‌ను డిజిటల్‌ వేదికగా చూడాలనుకొనే వారి సంఖ్య కోట్లలోనే ఉంటుంది. వారి కోసం ప్రముఖ టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా.. జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌తో ప్రత్యేక డేటా ప్లాన్లను తీసుకొచ్చాయి. ఆ వివరాలు ఇవీ..

జియో

  •  రూ.100 ప్లాన్‌: 90 రోజుల వ్యాలిడిటీ, 5జీబీ డేటాతో జియో ఈ ప్లాన్‌ అందిస్తోంది. జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌పై 90 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.
  •  రూ.299 కంటే ఎక్కువ మొత్తంతో రీఛార్జి చేసుకున్నా ఉచితంగా ఐపీఎల్‌ను వీక్షించే సదుపాయాన్ని జియో కల్పిస్తోంది. మార్చి 31 వరకు మాత్రమే ఈ ఆఫర్‌ అందుబాటులో ఉంటుంది. పై ప్లాన్లన్నీ ప్రస్తుతం కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి.

ఎయిర్‌టెల్‌ 

  •  రూ.100 ప్లాన్‌: 5జీబీ డేటా, 30 రోజుల వ్యాలిడిటీ అందిస్తోంది. జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌పై 30 రోజుల వ్యాలిడిటీతో లభిస్తుంది.
  •  రూ.195 ప్లాన్‌: 90 రోజుల వ్యాలిడిటీ, 15 జీబీ డేటా పొందొచ్చు. జియోహాట్‌స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌పై 90 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.

వొడాఫోన్‌ ఐడియా

  •  రూ.101 ప్లాన్‌: 30 రోజుల వ్యాలిడిటీ, 3 జీబీ డేటా, 90 రోజుల పాటు జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌
  •  రూ.151 ప్లాన్‌: 30 రోజుల వ్యాలిడిటీ, 4జీబీ డేటా, 90 రోజుల జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌
  •  రూ.169 ప్లాన్‌: 30 రోజుల వ్యాలిడిటీ, 8జీబీ డేటా, 30 రోజుల పాటు జియోహాట్‌స్టార్‌ మొబైల్‌ సబ్‌స్క్రిప్షన్‌
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు