Vodafone Idea: వీఐ రీఛార్జితో ఫ్రీగా స్విగ్గీ వన్‌ మెంబర్‌షిప్‌!

Vodafone Idea: కస్టమర్లను ఆకట్టుకోవడంలో భాగంగా టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా కొత్త ఆఫర్‌ ప్రకటించింది. రీఛార్జిపై స్విగ్గీ వన్‌ మెంబర్‌షిప్‌ అందిస్తోంది.

Updated : 25 Jan 2024 19:14 IST

Vodafone Idea | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్ ఐడియా (Vodafone Idea) మరో కొత్త ఆఫర్‌ తీసుకొచ్చింది. తమ వినియోగదారులకు రూ.2,500 విలువైన ‘స్విగ్గీ వన్‌’ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా అందించనున్నట్లు ప్రకటించింది. పోస్ట్‌ పెయిడ్‌ (postpaid) కస్టమర్ల కోసం దీన్ని తీసుకొచ్చింది. అలాగని వొడాఫోన్‌ ఐడియా ప్రకటించిన ‘స్విగ్గీ వన్‌’ సబ్‌స్క్రిప్షన్‌ ఆఫర్‌ అందరికీ వర్తించదు. మ్యాక్స్ ప్లాన్‌ రీఛార్జ్‌ చేసే వారికి మాత్రమే ఎక్స్‌క్లూజివ్‌గా అందిస్తోంది.

రివోల్ట్‌ నుంచి కొత్త EV బైక్‌.. సింగిల్ ఛార్జ్‌తో 150KM

వీఐ మ్యాక్స్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్‌లో భాగంగా రూ.501 లేదా అంతకంటే ఎక్కువతో రీఛార్జ్‌ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే ఈ మెంబర్‌షిప్‌ లభిస్తుంది. ప్రస్తుతం వీఐ రూ.501, రూ.701, రూ.1101, 1001,  మ్యాక్స్‌ పోస్ట్‌పెయిడ్‌ ప్లాన్లను అందిస్తోంది. ఈ ప్లాన్లపై అపరిమిత వాయిస్‌ కాల్స్‌, నెలకు 300 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. సోనీలివ్‌, డిస్నీ+ హాట్‌స్టార్‌, అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వంటి ఓటీటీ సబ్‌స్క్రిప్షన్‌తో పాటు ఈజ్‌మైట్రిప్ ప్రయోజనాలను ఆయా రీఛార్జులపై పొందొచ్చు. కొత్తగా స్విగ్గీ వన్‌మెంబర్‌షిప్‌ను జోడిస్తోంది.

స్విగ్గీ వన్‌ ప్రయోజనాలివే..

రూ.149 కంటే ఎక్కువ ధరకు స్విగ్గీ నుంచి ఆర్డర్ చేస్తే ఆహార పదార్థాలపై అన్‌లిమిటెడ్‌ ఉచిత డెలివరీ పొందొచ్చు. దాదాపు 30వేలకు పైగా రెస్టారెంట్ల నుంచి 30శాతం అదనపు డిస్కౌంట్‌ లభిస్తుంది. రూ.199 కంటే ఎక్కువ ధరతో స్విగ్గీ ఇన్‌స్టామార్ట్‌ నుంచి ఆర్డర్‌ చేసే అన్ని డెలివరీలను ఉచితంగా పొందొచ్చు. డైన్‌అవుట్‌పై 40శాతం తగ్గింపు, నెలకు రూ. 150 విలువైన రెండు కూపన్‌లు లభిస్తాయి. అన్ని స్విగ్గీ జీనీ (Swiggy Genie) డెలివరీ ఛార్జీలపై 10శాతం తగ్గింపు ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని