Revolt: రివోల్ట్‌ నుంచి కొత్త EV బైక్‌.. సింగిల్ ఛార్జ్‌తో 150KM

Revolt RV400 BRZ: రివోల్ట్‌ మోటార్స్‌ కొత్త విద్యుత్‌ బైక్‌ను భారత్‌ మార్కెట్‌లో లాంచ్‌ చేసింది. ఐదు రంగుల్లో దీన్ని ఆవిష్కరించింది.

Updated : 25 Jan 2024 15:41 IST

Revolt RV400 BRZ | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ విద్యుత్‌ బైక్‌ల తయారీ సంస్థ రివోల్ట్‌ మోటార్స్‌ (Revolt Motors) కొత్త ఎలక్ట్రిక్‌ బైక్‌ను భారత్‌లో లాంచ్‌ చేసింది. రివోల్ట్‌ ఆర్‌వీ 400 బీఆర్‌జెడ్‌ (Revolt RV400 BRZ) పేరుతో దీన్ని తీసుకొచ్చింది. ఈ బైక్‌ ధర రూ.1.38 లక్షలుగా (ఎక్స్‌షోరూమ్‌) కంపెనీ నిర్ణయించింది. ఇప్పటికే బుకింగ్స్‌ ప్రారంభమయ్యాయని రివోల్ట్‌ తెలిపింది. కంపెనీ వెబ్‌సైట్‌ ద్వారా లేదా రివోల్ట్‌ షోరూమ్‌కు వెళ్లి బుక్‌ చేసుకోవచ్చని పేర్కొంది. రివోల్ట్‌ కొత్త విద్యుత్‌ ఎలిప్స్‌ రెడ్‌, కాస్మిక్ బ్లాక్‌, మిస్ట్‌ గ్రే, ఇండియా బ్లూ, స్టెల్త్ బ్లాక్‌, లైటింగ్‌ ఎల్లో రంగుల్లో లభిస్తుంది. 

కుమారులకు రూ.480 కోట్ల గిఫ్ట్‌.. అజీమ్‌ ప్రేమ్‌జీ నిర్ణయం

ఇక ఫీచర్ల విషయానికొస్తే.. 3.24kWh లిథియం అయాన్‌ బ్యాటరీ 3KW మిడ్‌ డ్రైవ్‌ మోటార్‌ను అమర్చారు. ఇది 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 4.50 గంటల్లో బ్యాటరీ ఫుల్‌ ఛార్జ్‌ అవుతుంది. ఒక్కసారి ఛార్జింగ్‌ చేస్తే 150 కిలోమీటర్లు ప్రయాణించొచ్చని పేర్కొంది. ఇంతకుముందు తీసుకొచ్చిన ఆర్‌వీ400 మోడల్‌ లానే ఇందులోనూ మూడు రైడింగ్‌ మోడ్‌లు ఇచ్చారు. ఎకో మోడ్‌లో 150km రేంజ్‌ ఇస్తుంది. అదే నార్మల్‌ మోడ్‌లో 100km (65kmph టాప్‌స్పీడ్‌), స్పోర్ట్స్‌మోడ్‌, 80km (85 kmph టాప్‌స్పీడ్‌) సదుపాయం ఇచ్చారు. కాంబి-బ్రేకింగ్ సిస్టమ్; సైడ్-స్టాండ్ కటాఫ్‌; స్పీడ్‌, బ్యాటరీ స్థాయి, రైడింగ్ మోడ్, ఉష్ణోగ్రతను చూపించే డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఇందులో ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని