Vodafone Idea: రోజుకు 4జీబీ డేటా.. వొడాఫోన్‌ ఐడియాలో ప్రత్యేక ప్లాన్‌

Vodafone Idea: ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా ప్రత్యేకమైన ఆఫర్‌తో రూ.475 ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను అందిస్తోంది.

Published : 01 Sep 2023 13:54 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ టెలికం సంస్థ వొడాఫోన్‌ ఐడియా తమ యూజర్ల కోసం ఒక ప్రత్యేకమైన ప్లాన్‌ను అందిస్తోంది. దీని ధర రూ.475. వ్యాలిడిటీ 28 రోజులు. రోజుకి 4జీబీ డేటాను అందించడమే దీనిలోని ప్రత్యేకత. దీంతో పాటూ అదనంగా 2జీబీ డేటాను అందిస్తోంది. 

₹20 వేలకే గుజరాత్‌ ట్రిప్‌.. స్టాట్యూ ఆఫ్‌ యూనిటీ, ద్వారక దర్శనం.. వివరాలు ఇవే..!

రూ.475 రీఛార్జ్ చేసుకుంటే ప్రీపెయిడ్‌ కనెక్షన్‌ ( Prepaid Plan) కింద అపరిమిత కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు పొందవచ్చు. 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన ప్లాన్‌తో రోజుకు 4జీబీ డేటా అందిస్తోంది. అంటే 28 రోజులకు 112 జీబీ డేటా మీకు లభిస్తుంది. అంతే కాకుండా అదనంగా 2జీబీ డేటానూ కూడా ఇస్తోంది. అర్ధరాత్రి 12 గంటల నుంచి 6 గంటల వరకు అన్‌లిమిటెడ్‌ డేటాను ఆస్వాదించవచ్చు. ఇవే కాకుండా  ప్రీపెయిడ్‌ కనెక్షన్‌ కింద వీఐ మూవీస్‌, టీవీ వీఐపి ఓటీటీలను వీక్షించే సదుపాయం ఉంటుంది.  వీఐ యాప్ సబ్‌స్క్రైబర్లకు 5జీబీ డేటా బోనస్‌గా లభిస్తుంది. అయితే ఈ బోనస్‌ డేటా కేవలం మూడు రోజులు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని