ఎయిర్‌టెల్‌, జియో బాటలో వీఐ.. నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో కొత్త రీఛార్జి ప్లాన్లు

Vodafone Idea: ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా వీడియో స్ట్రీమింగ్‌ వేదిక నెట్‌ఫ్లిక్స్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. తన నెట్‌వర్క్‌ను మరింత బోలోపేతం చేసేందుకు ఈ సహకారం ఉపయోగపడుతుందని పేర్కొంది.

Published : 31 May 2024 00:22 IST

Vodafone Idea | దిల్లీ: యూజర్లను ఆకట్టుకోవడంలో భాగంగా ప్రముఖ టెలికాం సంస్థ వొడాఫోన్‌ ఐడియా (Vodafone Idea) కొత్త ప్రయత్నాలు చేస్తోంది. ఓటీటీలపై ప్రజలు ఆసక్తి చూపుతున్న తరుణంలో తన రీఛార్జి ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ (Netflix) సదుపాయాన్ని అందించేందుకు సిద్ధమైంది. దీనికోసం వీడియో స్ట్రీమింగ్‌ వేదికతో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు గురువారం పేర్కొంది. 

ఇప్పటివరకు ఎయిర్‌టెల్‌ (Airtel), జియో (Jio) నెట్‌ఫ్లిక్స్‌ సబ్‌స్క్రిప్షన్‌తో రీఛార్జి ప్లాన్‌లు తీసుకొచ్చాయి. తాజాగా వీఐ కూడా అదే జాబితాలో చేరింది. అపరిమిత కాల్స్‌, నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌తో డేటాను అందించే రెండు కొత్త ప్రీపెయిడ్‌ ప్లాన్లను (Prepaid Plan) ప్రవేశపెట్టింది. త్వరలోనే పోస్ట్‌ పెయిడ్‌ ప్లాన్లను (Postpaid Plan) ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. యూజర్లకు తమకు నచ్చిన డివైజెస్‌.. మొబైల్‌, టెలివిజన్‌లో ఈ స్ట్రీమింగ్‌ సదుపాయం పొందొచ్చని పేర్కొంది.

లగ్జరీ నౌకలో అనంత్‌-రాధిక ప్రీవెడ్డింగ్‌.. సెకండ్‌ డే ‘టోగా పార్టీ’ స్పెషల్‌

వీఐ తీసుకొచ్చిన రూ.998 ప్లాన్‌తో రీఛార్జిపై రోజుకు 1.5 జీబీ డేటా లభిస్తుంది. అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. 70 రోజుల వ్యాలిడిటీతో వస్తున్న ఈ ప్లాన్‌లో నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ (టీవీ లేదా మొబైల్‌) సబ్‌స్క్రిప్షన్‌ లభిస్తుంది. ఈ ప్లాన్‌ గుజరాత్‌, ముంబయి మినహా అన్ని నగరాల్లోని యూజర్లకు అందుబాటులో ఉంటుంది. ఈ రెండు నగరాల్లోని ప్రజలు మాత్రం ఇదే ఆఫర్‌ పొందాలంటే రూ.1,099తో రీఛార్జి చేసుకోవాలి. వీఐ 84 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చిన మరో ప్లాన్‌ ధర రూ.1,399. దీని రీఛార్జితో రోజుకు 2.5జీబీ డేటా, అపరిమిత వాయిస్‌ కాల్స్‌, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు లభిస్తాయి. నెట్‌ఫ్లిక్స్‌ బేసిక్‌ సబ్‌స్క్రిప్షన్‌ పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు