WhatsApp: వాట్సప్‌లో మరో కొత్త ఆప్షన్‌.. ఆన్‌లైన్‌లో ఉన్న వారి లిస్ట్‌ ఒకేచోట!

WhatsApp: యూజర్ల అవసరానికి తగ్గట్లుగా ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్‌లతో ముందుకువచ్చే వాట్సప్‌ సరికొత్త ఫీచర్‌ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని వాబీటా ఇన్ఫో తెలిపింది.

Published : 16 Apr 2024 15:24 IST

WhatsApp | ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సప్‌ (WhatsApp) మరో కొత్త ఫీచర్‌కు సిద్ధమైంది. పిన్‌ చాట్‌, ఏఐ ఫీచర్లను తీసుకొచ్చిన యాప్‌.. ఇప్పుడు చాట్‌ లిస్ట్‌లో ప్రత్యేక ఆప్షన్‌ తీసుకురానుంది. ఆన్‌లైన్‌లో ఉండేవారి లిస్ట్‌ ఒకేచోట దర్శనమివ్వనుంది. దీంతో కమ్యూనికేషన్‌ అనుభవం మరింత మెరుగుకానుందని వాట్సప్‌కు సంబంధించి ఎప్పటికప్పుడు అప్‌డేట్స్‌ అందించే ‘వాబీటా ఇన్ఫో’ తన బ్లాగ్‌లో పంచుకుంది.

సాధారణంగా వాట్సప్‌ కాంటాక్ట్స్‌ లిస్ట్‌లో ఓపెన్‌ చేయగానే చాట్‌ లిస్ట్‌ దర్శనమిస్తుంది. అందులో ఎవరు ఆన్‌లైన్‌లో ఉన్నారు? ఆఫ్‌లైన్‌లో ఎవరు ఉన్నారు? అనే వివరాలు తెలియాలంటే చాట్‌ లిస్ట్‌ ఓపెన్‌ చేయాల్సిందే. అలాకాకుండా కాసేపటి వరకు ఆన్‌లైన్‌లో ఉన్న వారి జాబితాను చూపిస్తే బాగుంటుంది కదూ! అదే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు వాట్సప్‌ సన్నద్ధమవుతోంది. వాట్సప్‌ ఓపెన్‌ చేయగానే యాక్టివ్‌ చాట్‌ లిస్ట్‌ కనిపించేలా కొత్త ఆప్షన్‌ను త్వరలోనే వాట్సప్‌ తీసుకురానున్నట్లు తెలిపింది.

ఫ్లిప్‌కార్ట్‌ సమ్మర్‌ సేల్‌.. ఏసీ, ఫ్యాన్లు, రిఫ్రిజిరేటర్లపై ఆఫర్లు

అంటే ఇకపై చాట్‌ బాక్స్‌ ఓపెన్‌ చేయగానే యాక్టివ్‌ కాంటాక్ట్‌ లిస్ట్‌ ఆప్షన్‌ కనిపించనుంది. కొన్ని ఎంపిక చేసిన కాంటాక్ట్‌లు మాత్రమే ఈ లిస్ట్‌లో దర్శనమిస్తాయని సమాచారం. అలాగని ఈ జాబితాలోని వ్యక్తుల ‘లాస్ట్‌ సీన్‌’, ‘ఆన్‌లైన్‌ స్టేటస్‌’లు కూడా కనిపించబోవని తెలిపింది. వినియోగదారుల గోప్యతను దృష్టిలోఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాబీటా ఇన్ఫో పేర్కొంది. రీసెంట్‌ ఆన్‌లైన్‌ కాంటాక్ట్స్‌ ఆప్షన్‌ ఇప్పటికే కొందరు బీటా యూజర్లకు అందుబాటులోకి వచ్చిందని, రానున్న రోజుల్లో అందరికీ అందుబాటులో రానుందని వెల్లడించింది. దీనికి సంబంధించిన స్క్రీన్‌ షాట్‌ను కూడా వాబీటా ఇన్ఫో పంచుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని