నిధుల దుర్వినియోగానికి పాల్పడిన హెచ్‌ఎంకు జైలు

ప్రభుత్వ పాఠశాల నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గన్నవరం 12వ అదనపు న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది.

Published : 23 Sep 2023 05:28 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రభుత్వ పాఠశాల నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ప్రధానోపాధ్యాయుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ గన్నవరం 12వ అదనపు న్యాయస్థానం శుక్రవారం తీర్పునిచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉంగుటూరు మండలం తేలప్రోలు జడ్పీ ఉన్నత పాఠశాల అభివృద్ధికి పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ప్రతినిధులు కాకినాడ ఓఎన్‌జీసీని సంప్రదించారు. స్పందించిన ఆ సంస్థ అధికారులు 2017 జనవరి 13న రూ.6.22 లక్షలను పాఠశాల ఆర్‌ఎంఎస్‌ఏ ఖాతాలో జమ చేశారు. తల్లిదండ్రుల కమిటీ తీర్మానించకుండా.. అప్పటి హెచ్‌ఎం తాడి ప్రసాద్‌ రూ.2.05 లక్షలను విడతలవారీగా తన సొంతానికి వాడుకున్నారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన హెచ్‌ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఉన్నతాధికారులకు తల్లిదండ్రుల కమిటీ ఫిర్యాదు చేసింది. అనంతరం విద్యాశాఖ ఫిర్యాదుపై ఉంగుటూరు పోలీసులు కేసు నమోదు చేశారు. జరిమానా చెల్లించనట్లయితే 3 నెలలు   అదనంగా జైలుశిక్ష అనుభవించాల్సి ఉంటుందని తీర్పులో పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని