ఆకస్మిక తనిఖీల్లో భారీ సొత్తు స్వాధీనం

మల్టీజోన్‌-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు.

Updated : 28 Apr 2024 05:28 IST

ఈనాడు, హైదరాబాద్‌: మల్టీజోన్‌-1 పరిధిలోని 16 జిల్లాల్లో చేపట్టిన ఆకస్మిక తనిఖీల్లో పోలీసులు భారీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల సన్నాహాల్లో భాగంగా మల్టీజోన్‌-1 ఐజీ రంగనాథ్‌ ఆదేశాల మేరకు  ఆయా పోలీస్‌స్టేషన్ల పరిధిలో శుక్రవారం సాయంత్రం 5 నుంచి శనివారం సాయంత్రం 5 గంటలవరకూ తనిఖీలు నిర్వహించారు. ఇందులో రూ.2,81,36,128 నగదు, రూ.4,05,823 విలువైన మద్యం, రూ.3,15,788 విలువైన 15,479 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి 15 కేసులు నమోదు చేసి, 25 మందిని అదుపులోకి తీసుకున్నారు. 8 వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని