ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నాయకుడి హత్య

ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్‌ బేస్‌ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు.

Updated : 28 Apr 2024 05:56 IST

చర్ల, న్యూస్‌టుడే: ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడ జిల్లాలో కాంగ్రెస్‌ జిల్లా నాయకుడు జోగ పొడియం(48)ను మావోయిస్టులు శుక్రవారం అర్ధరాత్రి ఆయన ఇంట్లోనే దారుణంగా హత్య చేశారు. పొటాలి సీఆర్పీఎఫ్‌ బేస్‌ క్యాంపు సమీపంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడ్డారు. ఇంట్లో నిద్రిస్తున్న జోగాను పదునైన ఆయుధంతో హత్య చేయడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పదేళ్ల క్రితం జోగ కుమారుడిని మావోయిస్టులు హత్య చేశారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు పిలుపునిచ్చినా పోతలిలో ఓటింగ్‌ జరిగింది. అలాగే లోక్‌సభ ఎన్నికల సందర్భంలోనూ గ్రామంలో ఓటింగ్‌ జరగడంతో ఆగ్రహించిన మావోయిస్టులు జోగను హత్యచేసి ఉంటారని భావిస్తున్నారు. అరణ్‌పూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని