కృష్ణా జిల్లాలో రూ.80లక్షల మద్యం పట్టివేత

ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్‌జంక్షన్‌ సర్కిల్‌ పరిధిలోని ఆత్కూరు స్టేషన్‌ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు.

Published : 29 Apr 2024 06:38 IST

గన్నవరం గ్రామీణం, న్యూస్‌టుడే: ఎన్నికల్లో పంపిణీ చేసేందుకు కృష్ణా జిల్లా గన్నవరం మండలం మెట్లపల్లిలో హనుమాన్‌జంక్షన్‌ సర్కిల్‌ పరిధిలోని ఆత్కూరు స్టేషన్‌ శివారులో నిల్వ ఉంచిన 58,080 క్వార్టర్ల మద్యం సీసాలను పోలీసులు పట్టుకున్నారు. భారీగా మద్యం నిల్వలు ఉన్నట్లు జిల్లా ఎస్పీ నేతృత్వంలోని ప్రత్యేక ఎన్నికల పోలీసు విభాగానికి సమాచారం అందడంతో.. హనుమాన్‌జంక్షన్‌ సీఐ నరసింహమూర్తితో కలిసి ఆదివారం మధ్యాహ్నం మెట్లపల్లికి చేరుకున్నారు. స్థానిక గూడపాటి దుర్గాప్రసాద్‌కు చెందిన మామిడి తోటలోని గెస్ట్‌ హౌస్‌ను తనిఖీ చేశారు. గోవాకు చెందిన 1,210 కేసుల్లోని దాదాపు 58,080 క్వార్టర్ల మద్యం సీసాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.80లక్షల మేర ఉంటుందని తెలిపారు. స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. దుర్గాప్రసాద్‌తోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇవి ఏ రాజకీయ పార్టీకి చెందినవి? వాటి వెనుక ఎవరు ఉన్నారన్న దానిపై దర్యాప్తు చేపట్టినట్లు సీఐ నరసింహమూర్తి వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని