TVS iQube: టీవీఎస్‌ ఐక్యూబ్‌లో 2 కొత్త వేరియంట్లు.. రూ.95 వేలకే బేస్‌ మోడల్‌

TVS iQube: టీవీఎస్‌ ఐక్యూబ్‌లో మరో రెండు కొత్త వేరియంట్లు వచ్చాయి. ఇప్పుడు బేస్‌ వేరియంట్‌ రూ.95 వేలకే లభించనుంది.

Published : 14 May 2024 13:51 IST

TVS iQube | ఇంటర్నెట్‌ డెస్క్‌: ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ తమ విద్యుత్తు స్కూటర్‌ ఐక్యూబ్‌ పోర్ట్‌ఫోలియోను విస్తరించింది. మరో రెండు కొత్త వేరియంట్లను విడుదల చేసింది. దీంతో ఈ స్కూటర్‌ (TVS iQube) ఇప్పుడు మొత్తం ఐదు వేరియంట్లు, 11 రంగుల్లో లభిస్తోంది.

కొత్తగా తీసుకొచ్చిన రెండు వేరియంట్లలో ఐక్యూబ్‌ (TVS iQube) బేస్‌ వేరియంట్‌ ఒకటి. దీని ధర రూ.95,000 (ఎక్స్‌షోరూం). 2.2kWh బ్యాటరీ సామర్థ్యంతో వచ్చే ఈ స్కూటర్‌ ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 75 కిలోమీటర్ల వరకు ప్రయాణిస్తుంది. గంటకు 75 కి.మీ గరిష్ఠ వేగాన్ని అందుకుంటుంది. రెండు గంటల్లో దీని బ్యాటరీ 80 శాతం వరకు ఛార్జ్‌ అవుతుంది. ఐదు అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే, నావిగేషన్‌, థెఫ్ట్‌ అలర్ట్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి. సీటు కింద 30 లీటర్ల స్టోరేజ్‌ ఉంటుంది.

మరోవైపు టీవీఎస్‌ ఐక్యూబ్‌ ఎస్‌టీలో (TVS iQube ST) 3.4kWh బ్యాటరీ ప్యాక్‌తో మరో కొత్త వేరియంట్‌ను తీసుకొచ్చింది. దీని ధర రూ.1.56 లక్షలు (ఎక్స్‌షోరూం). దీని రేంజ్‌ 100 కిలోమీటర్లు. బ్యాటరీని 2:50 గంటల్లో 80 శాతం వరకు ఛార్జ్‌ చేయొచ్చు. దీంట్లోనూ 7 అంగుళాల టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఉంది. బ్లూటూత్‌, అలెక్సా వాయిస్‌ అసిస్ట్‌, డిజిటల్‌ డాక్యుమెంట్‌ స్టోరేజ్‌ వంటి ఫీచర్లూ ఉన్నాయి. మరోవైపు ఎస్‌టీలోనే 5.1kWh వేరియంట్‌ కూడా ఉంది. దీని ధర రూ.1.85 లక్షలు (ఎక్స్‌షోరూం). దీని రేంజ్‌ 150 కిలోమీటర్లు. గరిష్ఠంగా గంటకు 82 కి.మీ వేగాన్ని అందుకుంటుంది. దీని బ్యాటరీ 4:18 గంటల్లో పూర్తిగా ఛార్జ్‌ అవుతుంది. ఎస్‌టీ వేరియంట్లను జులై 15కు ముందు బుక్‌ చేసుకున్న వారికి లాయల్టీ బోనస్‌ కింద రూ.10,000 రాయితీ లభిస్తుంది.

తాజాగా తీసుకొచ్చిన రెండు కొత్త వేరియంట్లతో కలిపి ఈ స్కూటర్‌ ఇప్పుడు ఐక్యూబ్‌ (2.2 kWh), ఐక్యూబ్‌ (3.4 kWh), ఐక్యూబ్‌ ఎస్‌ (3.4 kWh), ఐక్యూబ్‌ ఎస్‌టీ (3.4 kWh), ఐక్యూబ్‌ ఎస్‌టీ (5.1 kWh).. మొత్తం ఐదు వేరియంట్లలో లభిస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని