ఔషధాలపై గొడవ.. విద్యార్థి కడుపు చీల్చిన షాపు యజమాని
ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పుర్‌లో మెడికల్ షాపు యజమాని, ఓ న్యాయ విద్యార్థికి ఔషధాలపై తలెత్తిన చిన్న వాగ్వాదం హింసాత్మకంగా మారింది. దీంతో మెడికల్ దుకాణం యజమాని, అతడి అనుచరులు పదునైన ఆయుధంతో లా విద్యార్థి కడుపును చీల్చడంతో పాటు, రెండు చేతి వేళ్లు సైతం నరికేశారు. పోలీసుల కథనం ప్రకారం.. కేశవ్‌పురానికి చెందిన అభిజీత్ సింగ్ చందేల్(22) కాన్పుర్ విశ్వవిద్యాలయంలో న్యాయవిద్య మొదటి సంవత్సరం చదువుతున్నాడు. తన నివాసానికి సమీపంలో ఉన్న మెడికల్ షాపునకు అభిజీత్ ఆదివారం మందుల కోసం వెళ్లాడు. ఔషధ ధరల విషయంలో దుకాణ యజమాని అమర్ సింగ్ చౌహాన్‌తో తలెత్తిన వివాదం తీవ్రతరమైంది. యజమాని సహా అతని సోదరుడు విజయ్ సింగ్, వారి ఇద్దరు సహచరులు ప్రిన్స్ శ్రీవాస్తవ, నిఖిల్ తివారీలు అభిజీత్‌పై పాశవిక దాడికి పాల్పడ్డారు. బాధితుడి తలపై తొలుత బలంగా కొట్టారు. అనంతరం పదునైన ఆయుధంతో అభిజీత్ కడుపును చీల్చడంతో పాటు అతడి చేతి రెండు వేళ్లు నరికేశారు. దీంతో అభిజీత్ తీవ్రగాయాలతో రక్తపు మడుగులో రోడ్డు మీద పడిపోయాడు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలికి చేరుకొన్న కుటుంబసభ్యులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. అభిజీత్ ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు యజమాని చౌహాన్ సహా ముగ్గురు నిందితులను అరెస్ట్‌చేశారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

అనుమానంతో.. కుటుంబాన్ని అంతమొందించాడు!
చిన్న అనుమానం ఆ కుటుంబంలో రక్తపుటేరులు పారించింది. నలుగురి ప్రాణాల్ని బలి తీసుకుంది. ఒళ్లు గగుర్పొడిచే ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండలకేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. - 
                                    
                                        

రోడ్డు పక్కన నిల్చున్నా.. దూసుకొచ్చిన మృత్యువు
ఫోన్ రావడంతో రోడ్డు పక్కన ఆగిన దంపతులను.. అతివేగంగా దూసుకొచ్చిన కారు ఢీకొనడంతో అక్కడికక్కడే మృతిచెందిన విషాదకర ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రంలో ఆదివారం ఉదయం చోటు చేసుకుంది. - 
                                    
                                        

దిగుబడి రాదనే మనస్తాపంతో అన్నదాత బలవన్మరణం
అధిక వర్షాలతో పంట దెబ్బతిని.. దిగుబడి వచ్చేలా లేదని కలత చెంది పత్తి రైతు పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. - 
                                    
                                        

విద్యుదాఘాతంతో రైతు మృతి
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన రైతు.. అడవి పందుల కోసం ఏర్పాటు చేసిన విద్యుత్తు తీగ తగిలి మృతి చెందిన ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. - 
                                    
                                        

రాకాసి అల.. మృత్యు వల
శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని తీర ప్రాంతాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా, చెరువులో పడి మరొకరు గల్లంతయ్యారు. - 
                                    
                                        

10,147 కిలోల గంజాయి దహనం.. డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా
రాష్ట్రంలో గత ఏడాది జూన్ నుంచి ఇప్పటి వరకు గంజాయి సాగును పూర్తిగా అరికట్టామని డీజీపీ హరీష్‌కుమార్ గుప్తా తెలిపారు. - 
                                    
                                        

గుంటూరులో బయటపడ్డ కుళ్లిన మాంసం
గుంటూరులో కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసం భారీగా బయటపడింది. నగరంలోని పొన్నూరు రోడ్డు, నందివెలుగు రోడ్డు, డొంక రోడ్డు, అమరావతి రోడ్డు, పాతమటన్ మార్కెట్ తదితర ప్రాంతాల్లోని మాంసం.. - 
                                    
                                        

డ్రగ్స్‌తో పట్టుబడిన వైకాపా విద్యార్థి సంఘం నేత
విశాఖలో వైకాపా విద్యార్థి విభాగం నేత డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డారు. తమకు అందిన సమాచారంతో విశాఖలోని టాస్క్‌ఫోర్స్, నాలుగో పట్టణ పోలీసులు సంయుక్తంగా ఆదివారం దాడులు నిర్వహించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఐదో అంతస్తు నుంచి పడి పదేళ్ల బాలుడి మృతి
 - 
                        
                            

పోలీసుల అదుపులో మద్యం కేసు ఏ-20 నిందితుడు
 - 
                        
                            

బుద్ధుని పవిత్ర అవశేషాల ప్రదర్శన.. ఏటా మూడు రోజులే అవకాశం
 - 
                        
                            

జులన్ గోస్వామిగా అనుష్కశర్మ.. బయోపిక్ విడుదలకు సరైన సమయమిదే!
 - 
                        
                            

అడవి ఏనుగుల కట్టడికి సరికొత్త సాంకేతికత: పవన్ కల్యాణ్
 - 
                        
                            

ట్రావెల్స్ బస్సు బోల్తా.. ఇద్దరి మృతి.. పలువురికి గాయాలు
 


