Nellore: రాకాసి అల.. మృత్యు వల
మైపాడు బీచ్‌లో ముగ్గురు యువకుల దుర్మరణం
తుమ్మలపెంట తీరంలో చేపల వేటకు వెళ్లి మత్స్యకారుడి మృతి

మైపాడు బీచ్‌లో మృతదేహాలను పరిశీలిస్తున్న పోలీసులు
ఇందుకూరుపేట, కావలి, ఆత్మకూరు: శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. జిల్లా పరిధిలోని తీర ప్రాంతాల్లో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందగా, చెరువులో పడి మరొకరు గల్లంతయ్యారు. నెల్లూరు కోటమిట్టకు చెందిన హుమయున్(17), సమీద్(17), నారాయణరెడ్డిపేటకు చెందిన తాజిమ్(16) ముగ్గురు స్నేహితులు. వీరంతా ఇంటర్మీడియట్ చదువుతున్నారు. మధ్యాహ్నం మైపాడు బీచ్‌లో సేదతీరేందుకు వచ్చారు. తీరం వద్ద సరదాగా ఆడుతుండగా ఒక్కసారిగా మీదకు రాకాసి అలలు వచ్చాయి. ఒకరినొకరు కాపాడుకోవాలనే క్రమంలో మునిగిపోతూ రక్షించమని కేకలు వేశారు. మెరైన్ పోలీసులు వారిని కాపాడేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. విగత జీవులుగా మారిన యువకులను ఒడ్డుకు చేర్చారు. మృతదేహాలను నెల్లూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ సుధాకర్ రెడ్డి, ఎస్సై నాగార్జున తెలిపారు.
- సముద్రంలో చేపలు పడుతూ అదుపుతప్పి పడడంతో మత్స్యకారుడు కాటంగారి బ్రహ్మయ్య(34) మృతిచెందారు. కావలి మండలం తుమ్మలపెంట పంచాయతీ పెద్దరాముడుపాలెం గ్రామానికి చెందిన మత్స్యకారులతో కలసి పడవలో బోగోలు మండలం జువ్వలదిన్నె హార్బర్ నుంచి చేపల వేటకు వెళ్లిన బ్రహ్మయ్య ప్రమాదవశాత్తు సముద్రంలో పడిపోయారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం కావలి ప్రాంతీయాసుపత్రికి తరలించారు. ఎస్సై తిరుమలరెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 - ఆత్మకూరుకు చెందిన నలిశెట్టి మహేష్(30) అనే యువకుడు స్థానిక చెరువులోకి ఈత కోసం దిగగా, లోతు ఎక్కువగా ఉండటంతో అదుపుతప్పి పడిపోయారు. సమీపంలోని అయ్యప్ప స్వామి భక్తులు కాపాడేందుకు ప్రయత్నించినా.. గల్లంతయ్యారు. పోలీసులకు సమాచారమివ్వడంతో ఈతగాళ్లతో గాలిస్తున్నారు.
 
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

తనిఖీల్లో 40 కేజీల పట్టివేత
గుంటూరులో కుళ్లిన, నిల్వ ఉంచిన మాంసం భారీగా బయటపడింది. నగరంలోని పొన్నూరు రోడ్డు, నందివెలుగు రోడ్డు, డొంక రోడ్డు, అమరావతి రోడ్డు, పాతమటన్ మార్కెట్ తదితర ప్రాంతాల్లోని మాంసం.. - 
                                    
                                        

డ్రగ్స్‌తో పట్టుబడిన వైకాపా విద్యార్థి సంఘం నేత
విశాఖలో వైకాపా విద్యార్థి విభాగం నేత డ్రగ్స్ తరలిస్తూ పట్టుబడ్డారు. తమకు అందిన సమాచారంతో విశాఖలోని టాస్క్‌ఫోర్స్, నాలుగో పట్టణ పోలీసులు సంయుక్తంగా ఆదివారం దాడులు నిర్వహించారు. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

ఈ విజయం భవిష్యత్తు ఛాంపియన్లకు స్ఫూర్తి: ప్రధాని మోదీ
 - 
                        
                            

విజయవాడ ఆస్పత్రి వద్ద జోగి రమేశ్ అనుచరుల హంగామా
 - 
                        
                            

సచిన్ వినయం, మానవత్వం ప్రత్యక్షంగా చూశా: మంత్రి నారా లోకేశ్
 - 
                        
                            

నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (03/11/2025)
 - 
                        
                            

‘బిగ్‌బాస్-9’ నుంచి మాధురి ఎలిమినేట్.. అతడికి హౌస్‌లో ఉండే అర్హత లేదంటూ కామెంట్
 - 
                        
                            

కాశీలో దేవ్ దీపావళి.. 10లక్షల దీపాలతో ఏర్పాట్లు!
 


