Crime News: కుమారుడిని చంపి.. ఇంటి ముందు పడేసి: ‘మీ సింహమిదిగో’ అంటూ హేళన
పంజాబ్ (Punjab)లో దారుణ ఘటన చోటు చేసుకుంది. కొందరు దుండగులు ఒక యువకుడిని కత్తులతో పొడిచి హత్య చేశారు. అనంతరం మృతదేహాన్ని అతడి ఇంటి ముందు పడేశారు.
చండీగఢ్: పాతకక్ష ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. కొందరు దుండగులు ఒక యువకుడిని దారుణంగా హతమార్చి అతడి ఇంటి ముందు పడేశారు. ఈ ఘటన పంజాబ్ (Punjab)లో చోటు చేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం..
కపుర్తలాకు చెందిన హర్దీప్ సింగ్ అనే 22 ఏళ్ల యువకుడికి.. చాలా కాలంగా హర్‌ప్రీత్ సింగ్ అనే స్థానిక వ్యక్తితో వివాదాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే హర్దీప్పై కేసు నమోదైంది. పోలీసులు అరెస్టు చేస్తారనే భయంతో తల్లిదండ్రులకు దూరంగా వేరే ప్రాంతంలో ఉంటున్నాడు. బ్యాంకు పని ఉండడంతో ఇంటికి వచ్చాడు.
పనిపై బయటకు వెళ్లిన కుమారుడి కోసం అతడి తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. రాత్రి వేళ ఆరుగురు వ్యక్తులు ఇంటి ముందుకు వచ్చి ‘‘మీ కుమారుడిని చంపేశాం’’ అంటూ కేకలు వేశారు. దీంతో కంగారుగా బయటకు వచ్చిన తల్లిదండ్రులు రక్తపు మడుగులో పడి ఉన్న కుమారుడిని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు. అంతటితో ఆ నిందితులు ఊరుకోలేదు. ‘‘ఇదిగో మీ సింహం. ఇప్పుడు తీసుకువెళ్లండి’’ అని తల్లిదండ్రులను హేళన చేశారు.
వెంటనే అతడిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు వెల్లడించారు. బాధితుడి తండ్రి గురునామ్ సింగ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితుల్లో నలుగురిని అరెస్టు చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చేపట్టారు. పాతకక్షల కారణంగానే అతడిని హత్య చేశారని ఎస్పీ రాజ్‌పాల్ సింగ్ సంధు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Kakinada: బోటులో అగ్నిప్రమాదం.. కోస్టుగార్డు రెస్క్యూ ఆపరేషన్
కాకినాడ తీరంలో వేటకు వెళ్తున్న బోటులో అగ్నిప్రమాదం జరిగింది. -
Road Accident: ఆగివున్న లారీని ఢీకొట్టిన జీపు.. ఎనిమిది మంది మృతి
ఒడిశాలోని కెంఝహార్ జిల్లా 20వ నంబర్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. -
Nandyala: భార్యతో గొడవ.. అత్త, బావమరిదిపై కత్తితో దాడి
నంద్యాల జిల్లా పాణ్యంలో గురువారం అర్ధరాత్రి ఓ వ్యక్తి అత్త, బావమరిదిపై కత్తితో దాడికి తెగబడ్డాడు. బస్టాండు సమీపంలో నివాసం ఉంటున్న గణేశ్ డబ్బుల కోసం తరచూ భార్య తులసితో గొడవపడుతూ ఉండేవాడు. -
ప్రియుడి సూచనతో.. లేడీస్ హాస్టల్ టాయిలెట్లో రహస్య కెమెరా!
చండీగఢ్‌లో ఓ యువతి తన ప్రియుడి కోరిక మేరకు లేడీస్ హాస్టలు (పీజీ) మరుగుదొడ్లో వెబ్‌కెమెరాను అమర్చి పోలీసులకు చిక్కింది. -
ఎన్నికల వేళ మందుపాతర కలకలం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో గురువారం ఎన్నికల వేళ మావోయిస్టుల చర్యను భద్రతా బలగాలు భగ్నం చేశాయి. -
వలలో చిక్కిన చిరుత మృతి
కోతుల నుంచి పంట రక్షణకు రైతులు ఏర్పాటు చేసుకున్న వలలో చిరుత పులి చిక్కి మృతి చెందింది. ఈ సంఘటన అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల మండలం ఎల్లవరం గ్రామ శివారులో గురువారం చోటుచేసుకుంది. -
పొలం కబ్జా యత్నంపై ఫిర్యాదు చేశాడని ఇనుప రాడ్లతో దాడి
రాష్ట్రంలో వైకాపా నేతల అకృత్యాలకు అడ్డు లేకుండా ఉంది. తన పొలం కబ్జా యత్నంపై ఫిర్యాదు చేశాడన్న కక్షతో మైనారిటీ వర్గానికి చెందిన వ్యక్తిపై ఇనుపరాడ్లతో మూకుమ్మడి దాడి చేశారు. -
బ్యాంకులో 7 కేజీల ఆభరణాల గల్లంతు
శ్రీకాకుళం జిల్లా గారలోని స్టేట్ బ్యాంక్ శాఖలో ఖాతాదారులు కుదువ పెట్టిన 7 కేజీల బంగారు ఆభరణాలు గల్లంతయ్యాయి. -
ఈస్ట్‌కోస్ట్ రైలులో పొగలు
వేగంగా వెళుతున్న రైలులో పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఆందోళనకు గురైన ఘటన యాదగిరిగట్ట మండలం వంగపల్లి వద్ద గురువారం ఉదయం చోటుచేసుకుంది. -
కల్తీ ఔషధం తాగి గుజరాత్లో అయిదుగురి మృతి
గుజరాత్‌లోని ఖేడా జిల్లాలో గురువారం దారుణం జరిగింది. మిథైల్ ఆల్కహాల్ కలిగి ఉన్న ఆయుర్వేద ఔషధాన్ని తాగి అయిదుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు.


తాజా వార్తలు (Latest News)
-
LPG Cylinder Price: వాణిజ్య సిలిండర్‌పై రూ.21 పెంపు
-
KCR: డిసెంబర్ 4న తెలంగాణ కేబినెట్ భేటీ
-
CBSE: 10, 12వ తరగతి ఫలితాల్లో మార్కుల డివిజన్ ప్రకటించం: బోర్డు
-
Rishab Shetty: నేను చెప్పింది ఇప్పటికి అర్థం చేసుకున్నారు.. తన స్పీచ్‌పై రిషబ్ శెట్టి పోస్ట్
-
Bomb threat: బెంగళూరులో 44 స్కూళ్లకు బాంబు బెదిరింపులు
-
BSF: వీర జవాన్లతో.. పాక్, బంగ్లా సరిహద్దులు సురక్షితం: అమిత్ షా