logo

విక్రయదారులు లైసెన్స్ తీసుకోకపోతే చర్యలు

ఇండియాస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నమోదు లేదా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు.

Published : 23 Apr 2024 19:41 IST

ఎదులాపురం: ఇండియాస్ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ నమోదు లేదా సంబంధిత అధికారుల నుంచి లైసెన్స్ పొందకుండా ఆహార పదార్థాలు విక్రయించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోనున్నారు. ఈ మేరు ఫుడ్ సేఫ్టీ అధికారి డాక్టర్ మెట్పల్లివార్ శ్రీధర్ హెచ్చరించారు. ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్ చట్టం 2006 ప్రకారం రూ.ఐదు లక్షల జరిమానా చెల్లించి జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందన్నారు. ఈ మేరకు మంగళవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ ఫుడ్ సేఫ్టీ స్టాండర్డ్స్ చట్టం ప్రకారం అన్ని రకాల ఆహార పదార్థాల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలని సూచించారు. రూ.2వేల లోపు దినసరి ఆదాయం ఉన్నవారు వ్యాపార కేంద్రాన్ని నమోదు చేయించుకోవాలని, ఆపై ఆదాయం ఉన్నవారు విధిగా లైసెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది అన్నారు. లైసెన్స్ గడువు పూర్తయిన వారు వెంటనే పునరుద్ధరించుకోవాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని