logo

సదస్సుపై దాడికి పాల్పడటం ఉన్మాద చర్య

కవులు, రచయితలను, ప్రజాస్వామ్యాదులపై దాడికి పూనుకోవటం ఉన్మాదా చర్యని సీపీఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ (ప్రజాపంథా) కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారు.

Updated : 29 Apr 2024 18:11 IST

ఎదులాపురం: కవులు, రచయితలను, ప్రజాస్వామ్యాదులపై దాడికి పూనుకోవటం ఉన్మాదా చర్యని సీపీఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ (ప్రజాపంథా) కార్యదర్శి వర్గ సభ్యులు అన్నారు. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో సెక్యులర్ రైటర్స్ ఫారం ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన లౌకిక శక్తుల, రచయితల సమావేశంపై ఏబీవీపీ అరాచకవాదులు వేదికపై ఉన్న నాయకులు దుర్భాషలాడుతూ ప్లెక్సీలు బ్యానర్లు చించారు. దీన్ని ప్రజాస్వామికవాదులు ఖండించాలని ఆయన కోరారు.  ప్రజాస్వామిక వాదులపై దాడులు పూనుకోవటం ఎంతవరకు సమంజసం కాదన్నారు. ఇలాంటి చర్యలపై పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని ఆయన డిమాండ్ చేశారు. రేపు ఫాసిస్ట్ శక్తులకు 400 సీట్లు వస్తే  కనీసం ఆలోచించి అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ కూడా లేకుండా పోయే ప్రమాదం ఉందనడానికి ఇదొక ఉదాహరణ అని అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని