logo

అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక

‘అనకాపల్లి ఎంపీగా గెలవగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధికి చర్యలు చేపడతానని కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు.

Published : 28 Apr 2024 01:50 IST

మాట్లాడుతున్న వంగవీటి రాధా

మాడుగుల, న్యూస్‌టుడే: ‘అనకాపల్లి ఎంపీగా గెలవగానే ప్రత్యేక ప్రణాళిక రూపొందించి అభివృద్ధికి చర్యలు చేపడతానని కూటమి అభ్యర్థి సీఎం రమేశ్‌ పేర్కొన్నారు. మాడుగుల అసెంబ్లీ అభ్యర్థి బండారు సత్యనారాయణమూర్తి, తెదేపా నాయకుడు వంగవీటి రాధాతో కలిసి శనివారం రాత్రి మాడుగులలో రోడ్‌షో నిర్వహించారు. సీఎం రమేశ్‌ మాట్లాడుతూ.. తాను విశాఖపట్నం ఎంపీ టికెట్‌ కోరితే.. ప్రధాని మోదీ అభివృద్దిలో వెనుబడిన అనకాపల్లికి పంపారని చెప్పారు.  ఉప ముఖ్యమంత్రిగా ముత్యాలనాయుడు దోచుకున్నంత దోచుకుని, ఇపుడు ఆయన కుమార్తెను పంపారని ఆరోపించారు. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన పైలా ప్రసాదరావు కూటమి అభ్యర్థుల విజయానికి పనిచేస్తారని చెప్పారు.

  • వంగవీటి రాధా మాట్లాడుతూ.. కూటమి గెలుపుపైనే రాష్ట్ర భవిష్యత్‌ ఆధారపడి ఉందన్నారు. సీఎం రమేశ్‌, బండారు కలయికతో మాడుగుల ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు. బండారు, మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు తదితరులు మాట్లాడారు. నాయకులు పీవీజీ కుమార్‌ అప్పలరాజు, జగ్గారావు, దేముడు, రంజిత్‌, కృష్ణ, గంగయ్య, సునీత, సూర్యారావు పాల్గొన్నారు.

అనకాపల్లి, లక్ష్మీదేవిపేట,  కశింకోట, న్యూస్‌టుడే: కూటమి అభ్యర్థులు విజయం సాధిస్తే యువతకు అండగా ఉంటారని మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ తెలిపారు. తెదేపా రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్‌ మళ్ల సురేంద్ర ఆధ్వర్యంలో శనివారం 81వ వార్డు తెదేపా, జనసేన, భాజపా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. అనకాపల్లి అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ మాట్లాడుతూ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలన్నారు. తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగజగదీశ్వరరావు, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి, సంతోషిమాత దేవస్థానం మాజీ ఛైర్మన్‌ మళ్ల రాజు పాల్గొన్నారు. పట్టణంలోని విజయరామరాజుపేటలో జనసేన అసెంబ్లీ అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. వైకాపాకు చెందిన 50 మంది యువకులకు కండువాలు వేసి జనసేనలోకి ఆహ్వానించారు. కశింకోట మండలం నర్సింగబిల్లి గ్రామానికి చెందిన పాలసంఘం అధ్యక్షులు, స్థానిక వైకాపా నాయకులు కోన సురేష్, ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులతో రామకృష్ణ  సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.

కొత్తూరు (అనకాపల్లి), న్యూస్‌టుడే: మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ అనకాపల్లి మండలం సత్యనారాయణపురం, పిసినికాడ, సుందరయ్యపేట తదితర పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి కూలీలతో మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావలసిన చారిత్రక అవసరాన్ని అందరూ గుర్తించాలన్నారు. పచ్చికూర రాము, గెంజి సత్యారావు, జోగా భాను పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని