logo

సరిహద్దులు దాటని అభివృద్ధి

ఓట్ల పండగ ముగిసి త్వరలో రానున్న ప్రభుత్వం పగ్గాలు అందుకోబోతోంది.

Published : 19 May 2024 01:47 IST

అభివృద్ధికి నోచుకొని జె.నాయుడిపాలెం రోడ్డు

రోలుగుంట, న్యూస్‌టుడే: ఓట్ల పండగ ముగిసి త్వరలో రానున్న ప్రభుత్వం పగ్గాలు అందుకోబోతోంది. రాష్ట్రానికి కొత్త సారథులు రాబోతున్నారు. అయిదేళ్లకోసారి ఈ ప్రక్రియ మామూలే అయినప్పటికీ గ్రామాల్లోని అభివృద్ధి మాత్రం ‘సరిహద్దులు’ దాటడంలేదు. ఎమ్మెల్యేలుగా ఎవరొచ్చినా వారి పరిధిలోని గ్రామాలను తప్ప పక్క వాటిని పట్టించుకోవడం లేదు. రోలుగుంట మండలంలోని పలు రహదారులే ఇందుకు నిదర్శనం. వాస్తవానికి వీటిలో కొన్నింటికి ప్రతిపాదనలు వెళ్లినప్పటికీ కార్యరూపం దాల్చడంలో వెనుకబడ్డాయి. చోడవరం నియోజకవర్గ పరిధిలోని జె.నాయుడిపాలెం నుంచి నర్సీపట్నం నియోజకవర్గ పరిధిలోని మాకవరపాలెం మండలం తూటిపాలకు వెళ్లే రోడ్డు ఏళ్ల తరబడి ఆధునికీకరణకు నోచుకోలేదు. చోడవరం నియోజకవర్గం కాముడిపాలెం నుంచి నర్సీపట్నం నియోజకవర్గం చెట్లుపల్లి మెటల్‌ రోడ్డు ఎన్నో ఏళ్ల నుంచి ప్రతిపాదనల దగ్గరే ఆగిపోయింది. ఈ కారణంగా ఆయా గ్రామాల ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు. బుచ్చెయ్యపేట మండలం రాజాం, అనకాపల్లి నియోజకవర్గం కూండ్రం రోడ్డు అధ్వానంగా తయారైంది. ఈ రహదారిలో అక్కడక్కడా కొంతమేర మెరుగులు దిద్దినప్పటికీ చాలాచోట్ల ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. రానున్న ప్రభుత్వంలోనైనా వీటిని మెరుగుపరిస్తే ఎంతో ప్రయోజనం ఉంటుందని ప్రజలు చెబుతున్నారు.

ప్రతిపాదనలకే పరిమితమైన కాముడిపాలెం రహదారి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని