logo

రాక్షస పాలన నుంచి విముక్తి పొందుదాం

ఐదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన, భాజపా కూటమికి అఖండ విజయం చేకూర్చాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు.

Published : 28 Apr 2024 03:47 IST

మచిలీపట్నం (కోనేరు సెంటరు), న్యూస్‌టుడే: ఐదేళ్ల రాక్షస పాలన నుంచి విముక్తి పొందేందుకు తెదేపా, జనసేన, భాజపా కూటమికి అఖండ విజయం చేకూర్చాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర పిలుపునిచ్చారు. మచిలీపట్నం పార్లమెంట్‌ అభ్యర్థి వల్లభనేని బాలశౌరితో కలిసి శనివారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు.కేపీటీపాలెం, మాలకాయలంక, కమ్మవారిచెరువు, వాడపాలెం, వెంకట దుర్గాంబపురం, వాడగొయ్యి తదితర గ్రామాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారిరువురూ మాట్లాడుతూ ఐదేళ్ల పాటు అభివృద్ధిని విస్మరించిన వైకాపా ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాల విషయంలోనూ ప్రజలను మభ్యపెడుతోందనీ, నేరుగా నగదు ఇస్తున్నానంటూ రూపాయి ఇచ్చి పన్నులు, పెరిగిన ధరల రూపంలో పది రూపాయలు గుంజుకుంటున్న విషయాన్ని గుర్తించాలన్నారు. జనసేన నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ బండి రామకృష్ణ, ఇరు పక్షాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కరపత్రాల విడుదల : పోతేపల్లిలో ఆల్‌ ఇండియా పెన్షనర్స్‌ అసోసియేషన్‌ ప్రధాన కార్యదర్శి జి.పూర్ణచంద్రరావు, ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘ మాజీ అధ్యక్షుడు విజ్డమ్‌చౌదరి, ఎన్జీవో సంఘ మాజీ ఉపాధ్యక్షుడు నాగరాజు, వివిధ సంఘాల నాయకుల సమక్షంలో కూటమి నాయకులు కొల్లు రవీంద్ర, బండి రామకృష్ణ, తదితరులు పార్టీ కరపత్రాలను విడుదల చేశారు. మాదివాడ రాము, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని