logo

ఎన్నికల మస్కట్‌గా ‘వేరుసెనగ విత్తనం’

ఇక నుంచి జిల్లా ఎన్నికల మస్కట్‌గా ‘వేరుసెనగ విత్తనం’ ఆకృతిని అధికారికంగా గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ప్రకటించారు. ఉత్తమ ఎన్నికల మస్కట్‌ పోటీల వివరాలను సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రకటించారు.

Published : 23 Apr 2024 04:54 IST

మస్కట్‌ను ఆవిష్కరిస్తున్న కలెక్టర్‌ వినోద్‌కుమార్‌, జడ్పీ సీఈఓ నిదియాదేవి, విజేత ప్రశాంత్‌కుమార్‌

అనంతపురం(శ్రీనివాస్‌నగర్‌), న్యూస్‌టుడే: ఇక నుంచి జిల్లా ఎన్నికల మస్కట్‌గా ‘వేరుసెనగ విత్తనం’ ఆకృతిని అధికారికంగా గుర్తించారు. ఈ విషయాన్ని కలెక్టర్‌ వినోద్‌కుమార్‌ ప్రకటించారు. ఉత్తమ ఎన్నికల మస్కట్‌ పోటీల వివరాలను సోమవారం కలెక్టర్‌ కార్యాలయంలో ప్రకటించారు. మొత్తం 62 మంది పలు ఆకృతులను తయారు చేశారు. ఇందులో వేరుసెనగ విత్తన నమూనాను ఉత్తమమైందిగా ఎంపిక చేశారు. విజేత ప్రభుత్వ ఆర్ట్స్‌ కాలేజీ విద్యార్థి గూడురు ప్రశాంత్‌ కుమార్‌కు రూ.5 వేలు, ప్రశంసాపత్రాన్ని కలెక్టర్‌, జడ్పీ సీఈఓ నిదియాదేవి అందించారు. మిగతా 62 మందికి ప్రశంసాపత్రాలు ప్రదానం చేశారు. కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్రంలోనే ప్రథమంగా ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసినట్లు చెప్పారు. ఈ ఆలోచన జడ్పీ సీఈఓదేనని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని