logo

చిట్టడివి కాదు.. జగనన్న కాలనీనే

జగనన్న కాలనీల్లో తమ ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇవ్వడమే కాదు.. ఊళ్లనే నిర్మిస్తోందని సీఎం జగన్‌, వైకాపా నాయకులు సభలు, సమావేశాల్లో ఊదరగొట్టారు.

Published : 29 Apr 2024 03:37 IST

హోతూరు దారిలో కంపచెట్లతో నిండి...

ఉరవకొండ, న్యూస్‌టుడే: జగనన్న కాలనీల్లో తమ ప్రభుత్వం పేదలకు స్థలాలు ఇవ్వడమే కాదు.. ఊళ్లనే నిర్మిస్తోందని సీఎం జగన్‌, వైకాపా నాయకులు సభలు, సమావేశాల్లో ఊదరగొట్టారు. ఆచరణలో ఇళ్లు నిర్మించిన దాఖలాలు పెద్దగా లేవనే చెప్పాలి. ఉరవకొండ శివారు చాబాల దారిలోని జగనన్న కాలనీలో 220 ప్లాట్లు ఉన్నాయి. అందులో 179 మందికి పట్టాలు ఇచ్చారు. ఇప్పటి వరకు ఒక్క లబ్ధిదారుడు మాత్రమే ఇల్లు నిర్మించుకున్నాడు. మిగతా ప్లాట్లలో కంపలు పెరిగాయి. పట్టణ శివారు హోతూరు దారిలోని జగనన్న కాలనీలో 121 ప్లాట్లు ఉండగా, 108 మంది లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చారు. ఇక్కడ ఇళ్ల నిర్మాణాలకు లబ్ధిదారులు ముందుకు రాలేదు. ఈ రెండు కాలనీలకు దగ్గరలో శ్మశానం ఉంది. పైగా పట్టణానికి దూరంగా ఉన్నాయి. ఇళ్ల నిర్మాణాలకు ఆ ప్రదేశం అనువుగా లేదని లబ్ధిదారులు ఆసక్తి చూపలేదు. దాంతో రెండు కాలనీల్లో కంపలు విపరీతంగా పెరిగి చిట్టడవులను తలపిస్తున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు