logo

పెద్దారెడ్డి విధ్వంసకాండ

వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. పోలింగ్‌ రోజునే తనలోనే నిజస్వరూపాన్ని బయటపెట్టాడు.

Published : 15 May 2024 04:52 IST

గాయపడిన తెదేపా వర్గీయుడు

తాడిపత్రి, న్యూస్‌టుడే: వైకాపా ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిని తన గుప్పిట్లో ఉంచుకోవడానికి చేస్తున్న అరాచకాలు అన్నీఇన్నీ కావు. పోలింగ్‌ రోజునే తనలోనే నిజస్వరూపాన్ని బయటపెట్టాడు. తెదేపా ఏజెంట్లపై దాడులకు తెగబడి భయాందోళన సృష్టించాడు. అంతటితో ఊరుకోక మంగళవారం సైతం తాడిపత్రిలో యుద్ధ వాతావరణాన్ని తలపించేలా అందర్నీ భయకంపితులను చేశాడు. పట్టణంలో తన వాహన శ్రేణితో వేగంగా తిరుగుతూ అరాచకత్వానికి నిలువుటద్దంగా నిలిచాడు. ఇదంతా చూస్తున్న జనం భయంతో వణికిపోవడం కనిపించింది. ఇళ్లల్లోకి వెళ్లి తలుపులు వేసుకొని రోజంతా గడాల్సిన దుస్థితి ఏర్పడింది. పోలీసులు సైతం ఆలోచించాల్సిన పరిస్థితిని తీసుకొచ్చారు. ఏఎస్పీ లాంటి అధికారినే దుర్భాషలాడిన పెద్దారెడ్డిని అదుపు చేసేవారే లేరా? అన్న ప్రశ్న పట్టణవాసుల్లో మెదిలింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని