logo

ప్రజావ్యతిరేక పాలనకు చరమగీతం పాడుదాం

వైకాపా అవినీతి, అక్రమాల పాలనకు అంతం పలకాలని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని కెంచానపల్లి, జుంజురాంపల్లి, బీఎన్‌హళ్లి, బొమ్మక్కపల్లి, మల్లాపురం గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు.

Published : 02 May 2024 03:41 IST

మల్లాపురంలో మహిళలను ఓట్లు అభ్యర్థిస్తున్న కాలవ శ్రీనివాసులు

రాయదుర్గం గ్రామీణం, న్యూస్‌టుడే: వైకాపా అవినీతి, అక్రమాల పాలనకు అంతం పలకాలని రాయదుర్గం తెదేపా ఎమ్మెల్యే అభ్యర్థి కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. మండలంలోని కెంచానపల్లి, జుంజురాంపల్లి, బీఎన్‌హళ్లి, బొమ్మక్కపల్లి, మల్లాపురం గ్రామాల్లో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఆయా గ్రామాల్లో ప్రజలు, నాయకులు, కార్యకర్తలు కాలవకు స్వాగతం పలికి పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మ్యానిఫెస్టోను అన్ని వర్గాల ప్రజల అభివృద్ధి, సంక్షేమం కాంక్షిస్తూ రూపొందించారన్నారు. జగన్‌ అధికారం చేపట్టిన నాటి నుంచి తొమ్మిది సార్లు విద్యుత్తు ఛార్జీలు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరిచారన్నారు. ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓట్లు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రచారంలో తెదేపా రాయదుర్గం మండల కన్వీనర్‌ ఎంఆర్‌ఎఫ్‌ హనుమంతు, జిల్లా తెదేపా ఉపాధ్యక్షుడు కాటా వెంకటేశులు, మండల నాయకులు భీమసేనరావు, పి.రవికుమార్‌, సిద్ధప్ప, గిరిధర్‌నాయుడు, వీరేశ్‌స్వామి, సోమశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

మల్లాపురం గ్రామంలో మోదీ, చంద్రబాబునాయుడు, పవన్‌ కల్యాణ్‌ చిత్రపటానికి కాలవ శ్రీనివాసులు, జనసేన అధ్యక్షుడు మంజునాథగౌడ్‌, తెదేపా నేతలు పాటిల్‌ అజయ్‌కుమార్‌ రెడ్డి, పాటిల్‌ సదాశివరెడ్డి పాలాభిషేకం చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైకాపాకు చెందిన 35 కుటుంబాలు తెదేపాలో చేరాయి. వారందరికీ కాలవ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. బొమ్మక్కపల్లి గ్రామంలో చంద్ర శేఖర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైకాపాకు చెందిన 10 కుటుంబాలు తెదేపాలో చేరాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు