logo

ముగిసిన జాతీయ సంగోష్ఠి కార్యక్రమం

తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారి ఉత్కల పీఠం, న్యూదిల్లీ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫిలాసఫికల్‌ రీసెర్చ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన జాతీయ సంగోష్ఠి కార్యక్రమం.

Published : 31 Mar 2023 02:32 IST

సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు

తిరుపతి(విద్య), న్యూస్‌టుడే: తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం వారి ఉత్కల పీఠం, న్యూదిల్లీ ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫిలాసఫికల్‌ రీసెర్చ్‌ సంయుక్త ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు జరిగిన జాతీయ సంగోష్ఠి కార్యక్రమం గురువారం ముగిసింది. శ్రీచైతన్య ఫిలాసపీ ఎ డైలాగ్‌ విత్‌ ఆదర్‌ దర్శనాస్‌ అనే అంశంపై చర్చించారు. కార్యక్రమంలో ఇస్కాన్‌ మందిర అధ్యక్షుడు రేవతి రమణ దాస్‌ ప్రభు, శ్రీ వేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం వీసీ రాణి సదాశివమూర్తి, సంస్కృత విశ్వవిద్యాలయం వీసీ ఆచార్య జీఎస్‌ఆర్‌ కృష్ణమూర్తి, లోకభాషా ప్రచార సమితి అధ్యక్షుడు డాక్టర్‌ సదానంద దీక్షిత్‌, ఉత్కల పీఠం డైరెక్టర్‌ జ్ఞానరంజన పండా, డీన్‌ ఎ.శ్రీపాదభట్ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని